Rajinikath

రెండున్నర గంటల సినిమా కాదు

Submitted by lakshman on Fri, 01/19/2018 - 11:34

రాజ్య‌స‌భ మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కోలీవుడ్ ఇండ‌స్ట్రీ సూప‌ర్ స్టార్ లు  రాజ‌కీయాల్లో వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన జ‌య‌ప్ర‌ద పాలిటిక్స్ అంటే రెండున్న‌గంట‌ల సినిమా కాద‌ని,  ఇందులో రాణించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అన్నారు. రాజ‌కీయాలు పూల దారి కాద‌ని ముళ్ల‌దార‌ని అందులో ఎత్తు ప‌ల్లాలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయ‌ని వాటిని త‌ట్టుకొని రాణించాల‌ని హితువుప‌లికారు.

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా..234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ : ర‌జ‌నీ కాంత్

Submitted by arun on Sun, 12/31/2017 - 10:52

రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజ‌నీకాంత్‌ తెరదించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించారు. కొద్దిరోజుల క్రితం 2.0 విడుదలైన తరువాత రెండు నెలలకు పా రంజిత్ తీసే కాలా విడుదల త‌రువాత‌ ఏమవుతుందో దేవుడికే తెలియాలి అన్న ర‌జినీ వ్యాఖ్య‌ల్నిఆయ‌న ఇక సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ బోతున్నారాని సినీ విశ్లేష‌కులు, ఆయ‌న అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. వారి అభిప్రాయాల‌కు అనుగుణంగానే కొద్దిసేప‌టి క్రితం త‌న అభిమానుల సమ‌క్షంలో తాను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.