Karnataka

కర్ణాటకలో నిఫా వైరస్ కలకలం : ఇద్దరి శరీరంలో వ్యాధి లక్షణాలు

Submitted by arun on Wed, 05/23/2018 - 15:08

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బుధవారం(మే-23) కర్ణాటకకు చెందిన హెల్త్ అధికారి తెలిపారు. పూర్తి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం వారి రక్త నమూనాలు మణిపాల్ పంపించాం అని.. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న ఇద్దరిని..

కర్నాటక ము‌ఖ్యమంత్రిగా ఇవాళ కుమారస్వామి ప్రమాణస్వీకారం

Submitted by arun on Wed, 05/23/2018 - 10:04

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరు విధానసౌధ ఎదురుగా ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కుమారస్వామితోపాటు కర్నాటక టీపీసీసీ చీఫ్‌ పరమేశ్వర.... డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి సోనియా, రాహుల్‌తోపాటు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.

కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : అమిత్‌ షా

Submitted by arun on Wed, 04/18/2018 - 15:58

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగుర వేస్తూ వస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అన్ని రాష్ట్రాల్లో గెలిచిన విధంగానే దక్షిణాదికి ముఖద్వారమైన కర్ణాటకలోనూ విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని సాగనంపి యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో విజయం సామాన్యమైంది కాదన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముఖద్వారమన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళలోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. 

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

Submitted by arun on Mon, 04/16/2018 - 17:13

కర్నాటక కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. మొత్తం 224 సీట్లకు గానూ 218మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అనూహ్యంగా 90శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. ప్రస్తుతమున్న 122మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 107మందికి టికెట్లు ఇచ్చారు. అయితే టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పలుచోట్ల ఆశావహులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా మాండ్యా, చిక్‌ మంగళూరు, రాజాజీనగర్‌‌, బళ్లారి, మంగళూరులో ఆశావహులు రచ్చరచ్చ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. 

రాహుల్‌గాంధీని గురిచూసి విసిరాడు..

Submitted by arun on Fri, 04/06/2018 - 15:24

ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తుముకూరులో ఓపెన్‌టాప్ ఎస్‌యూవీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో సడెన్‌గా ఓ దండ వచ్చి ఆయన మెడలో పడింది. ఎవరో ముందుండి చాలా శ్రద్ధగా మెడలో వేసినట్లు ఆ పూలమాల పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాహుల్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ పూలమాలను తొలగించి అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్‌షోను కొనసాగించారు.

అమావాస్య రోజు ఓట్ల లెక్కింపు... నేతల ఆందోళన

Submitted by arun on Fri, 03/30/2018 - 15:58

కర్ణాటకలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలకు..., తిధి, వారాలు, ముహూర్తాలు, వాస్తు దోషాలు టెన్షన్‌ పెడుతున్నాయా.? కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారా ? ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలకు గ్రహాల అనుకూలతలు లేవా ? పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలపై నేతలకు ఎందుకంత భయం పట్టుకుంది. 

మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగరా

Submitted by arun on Tue, 03/27/2018 - 12:48

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఏప్రిల్‌ 17న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. 224 స్థానాలున్న కర్ణాటకలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్‌ రావత్‌ తెలిపారు. మే 12 పోలింగ్‌ నిర్వహించి15న ఫలితాలు ప్రకటించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 25న స్క్రూటినీ, 27న నామినేషన్లను విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. 

ఆసక్తి రేపుతోన్న సీఫోర్స్ సర్వే

Submitted by arun on Tue, 03/27/2018 - 11:34

కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్‌ మూడో స్థానంలో సరిపెట్టుకుంటుందా ? ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఓటర్లు షాకివ్వనున్నారా ? సిద్ధరామయ్య మరోసారి సీఎం కావడం ఖాయమేనని సీ ఫోర్స్‌ సర్వేలో తేలింది. గతం ఎన్నికల కంటే ఈ సారి ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా వేసింది.