Karnataka

కుక్క వర్సెస్‌ నాగుపాము

Submitted by arun on Wed, 10/24/2018 - 13:53

నాగుపాము, కుక్క మధ్య జరిగిన విరోచిత పోరాటం  వైరల్‌గా మారింది. కర్ణాటకలోని  హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు  మధ్య పెద్ద గొడవే జరిగింది. అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది. తన జోలికి రావద్దని నాగుపాము కుక్కను బెదిరిస్తూ పొదల్లోకి జారుకుంది.

#MeToo ఎఫెక్ట్: నన్నే వేధిస్తావా అంటూ చితకబాదింది

Submitted by arun on Tue, 10/16/2018 - 10:57

‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా #MeToo ప్రకంపనలు రేపుతున్న తరుణంలో కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్ణాటక ఓ మహిళ శివంగిలా మారిపోయింది.  లోన్ కావాలని దేవనగెరెలోని ఓ బ్యాంకుకు వెళ్లిన మహిళ పట్ల బ్యాంక్‌ మేనేజర్‌ అసభ్యంగా మాట్లడటంతో పాటు  తాను చెప్పినట్లు చేయాలని వేధింపులకు దిగాడు. దీంతో ఆగ్రహించిన మహిళ నన్నే వేధిస్తావా అంటూ మేనేజర్‌ను కర్రతో చితకబాదింది. ఓ మహిళ లోన్ కావాలని దేవనగెరెలోని ఓ బ్యాంకుకు వెళ్లింది.

ఏపీలో ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించకపోవడంపై ఈసీ వివరణ

Submitted by arun on Tue, 10/09/2018 - 14:09

కర్ణాటకలో లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం..ఏపీలో ఖాళీ అయిన ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఏపీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై మీడియాలో కథనాలకు సీఈసీ వివరణ ఇచ్చింది.  ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే 6 నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాలని ఈసీ తెలిపింది. కర్ణాటకలో 3 లోక్ సభ సీట్లు మే 21 నాటికే ఖాళీ అయ్యాయని అదే ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్థానాలు మాత్రం జూన్ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది.

కర్ణాటక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం

Submitted by arun on Tue, 09/04/2018 - 10:05

కర్ణాటకలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్‌ జెడిఎస్ సంకీర్ణానికి బూస్టింగ్ ఇచ్చాయి. బిజెపికి పరాభవాన్ని కలిగించాయి. మొత్తం 2664 వార్డుల్లో బిజెపి కేవలం 927 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. పట్టణ ప్రాంతాల్లో కూడా బిజెపి అనుకున్నఫలితాలు సాధించలేక ఢీలా పడిపోయింది.

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే మా లక్ష్యం

Submitted by arun on Fri, 08/31/2018 - 13:06

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాల ఆయన చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు రచిస్తామన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే విస్త్రత స్ధాయిలో దీనిపై చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. 

ఘోరం.. భార్య శవం పక్కన వారం రోజులు

Submitted by arun on Mon, 07/16/2018 - 12:14

కట్టుకున్న భార్య చనిపోతే  భార్య శవాన్ని ముట్టుకోలేదు భర్త. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి  సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు ఉన్నాడు. మనస్సును కదలించే ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది.

శ్మశానంలో పెళ్ళిరోజు జరుపుకున్నారు.. ఎందుకో తెలుసా ?

Submitted by arun on Wed, 07/11/2018 - 16:46

దయ్యాల్లేవు, భూతాల్లేవు, అదంతా ఒట్టి రూమర్ అని నిరూపించడానికి ఓ జంట తమ పెళ్ళిరోజును శ్మశానంలో జరుపుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే..కర్నాటకలోని కల్‌బుర్గి జిల్లాలో మూఢ నమ్మకాలను దూరం చేసేందుకు ఆ దంపతులు వినూత్న ప్రయోగం చేశారు. వీరు తమ 18 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను శ్మశానంలో చేసుకున్నారు. కల్‌బుర్గి‌లోని శివారు గ్రామమైన నందీకుర్‌కు చెందిన పవన్ కుమార్, అనిత‌ల విచిత్ర వివాహ వార్షికోత్సవానికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వేడుకలకు గుర్తుగా వారు మొక్కలను కూడా నాటారు. అనిత జిల్లా పంచాయతీ అధ్యక్షులిగా పనిచేశారు. ఆమె భర్త వవన్ కుమార్ సామాజిక కార్యకర్త.

కర్ణాటక ప్రజలకు సీఎం కుమారస్వామి తొలిషాక్!

Submitted by arun on Thu, 07/05/2018 - 17:27

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కర్ణాటక సీఎం కుమారస్వామి అక్కడి ప్రజలకు తొలి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను భారాలను మోపారు. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నును 30 నుంచి 32 శాతానికి, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 1.14, డీజిల్‌ రూ 1.12 మేర పెరగుతాయని చెప్పారు.

చిన్నారి అపహరణ కథ సుఖాంతం...అమ్మ ఒడి చేరిన చిన్నారి

Submitted by arun on Wed, 07/04/2018 - 10:31

కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతమైంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప తల్లి ఒడికి చేరడంతో కుటుంసభ్యులు పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పాప కథ సుఖాంతమైంది. పాప తల్లిదండ్రులు చెంతకు చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పాప ఎక్కడ ఉందోనని ఆందోళన వ్యక్తం చేస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి పాప ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. 

ఎమ్మెల్యే ప్రియురాలి హల్‌చల్‌

Submitted by arun on Fri, 06/22/2018 - 11:47

కర్ణాటక రాజకీయాల్లో ప్రేమకుమారి వేడి పుట్టిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కి, ఎన్నికల సమయంలో నానా హంగామా చేశారామె. తాజాగా, హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయంలో ఆమె ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే రామదాసు తన భర్తని తాను బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలసి జీవిస్తానంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకొన్నామని అయితే ఎన్నికల ఫలితాల వెలువడినప్పటి నుంచి రామదాసు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించారు.