pawan kalyan

జనసేన తీర్థంపుచ్చుకున్న కాంగ్రెస్ నేత..

Submitted by chandram on Sat, 11/10/2018 - 16:28

ఎట్టకేలకు జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమ‍క్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బాలరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జనసేనని పవన్ తెలిపారు. తనదీ, నాదేండ్ల మనోహర్‌ది, బాలరాజుది ఒకటే భావస్వారూప్యతని పవన్ వ్యక్యనించారు. గిరిజనుల అభివృద్ధి కోసం బాలారాజు సేవలను, అనుభవాన్ని పార్టీలో వినియోగించుకుంటామని జనసేనాని వెల్లడించారు.
 

గిరిజనులతో పవన్ కల్యాణ్‌ సమావేశం

Submitted by arun on Sun, 11/04/2018 - 16:59

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ లాటరైట్‌ మైనింగ్‌ ప్రాంతంలో జనసేనాని పర్యటించారు. సముద్ర మట్టానికి 860 అడుగుల ఎత్తులో ఉండే వంతాడ గ్రామానికి భారీ భద్రత మధ్య చేరుకున్న పవన్ కల్యాణ్‌ గిరిజనులతో సమావేశమై లాటరైట్‌ మైనింగ్‌‌ పరిస్థితులను పరిశీలించారు. పవన్ కల్యాణ్‌ అధికారిక ఫేస్‌ బుక్‌ పేజ్‌ నుంచి లైవ్‌లో మాట్లాడిన జనసేనాని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మైనింగ్‌ జరుగుతుంటే గిరిజనులకు, స్థానికులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సహజ సంపదను దోచుకుంటుంటే కళ్లప్పగించి చూస్తారా? ఇదేనా రియల్ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే అంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబుపై విరుచుకపడ్డ పవన్ కల్యాణ్

Submitted by arun on Sun, 11/04/2018 - 12:42

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో, ఉసరవెళ్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది, అలిసిపోయి ఉన్నారని పవన్ కల్యాన్ ట్వీట్ చేశారు. మీ నోటితో ప్రజల మీద చేసే అఘాయిత్యాలు ఆపేయాలని, ఇక భరించలేకుండా ఉన్నామని చంద్రబాబుపై  పవన్ కల్యాణ్ విరుచుకపడ్డారు.

నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది!

Submitted by arun on Sat, 11/03/2018 - 17:14

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ గబ్బర్ సింగ్. ఇది  2012 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా యొక్క పునఃనిర్మాణమగు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా  విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇందులోని కొన్ని మాటలు తూటాల్ల పేలాయి...

పవన్ కల్యాణ్ ట్రైన్ జర్నీ..

Submitted by arun on Fri, 11/02/2018 - 12:31

పవన్ కల్యాణ్ మరో దఫా ప్ర‌జా పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇవాల్టి నుంచి పోరు బాట పడుతున్నారు. తుని నుంచి శ్రీకారం చుట్టే ఈ యాత్ర‌ను పవన్ వినూత్నంగా ప్రారంభించబోతున్నారు. తుని వెళ్ళడానికి పవన్ రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. వివిధ వర్గాల ప్రజలను, అభిమానులను కలుసుకుంటూ ఇవాళ మధ్యాహ్నం పవన్ విజ‌య‌వాడ నుంచి రైలు ప్రయాణం ప్రారంభిస్తారు. ఇందుకు జన్మ‌భూమి ఎక్స్ ప్రెస్ వేదిక కాబోతోంది. 

చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగుల గురించి విన్నాం..ఇప్పుడు...

Submitted by arun on Thu, 11/01/2018 - 17:25

ఓట్ల గల్లంతుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సాధారణంగా చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగుల గురించి విన్నాం, ఇప్పుడు ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగుల గురించి వింటున్నాము అని ఆయన ఎద్దేశా చేశారు. ఓట్ల గల్లంతుపై టీడీపీ నేతలు ఏం మాట్లాడుతారో ఎదురుచూస్తున్నాను అని చెప్పిన పవన్...త్వరలో ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు.  

జనసేనకు పవన్‌ మాతృమూర్తి విరాళం

Submitted by arun on Wed, 10/31/2018 - 11:27

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  తల్లి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు.  జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె 4లక్షల రూపాయల చెక్కును అందించారు.  పవన్‌ కల్యాణ్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పెన్షన్ విలువేంటో తనకు తెలుసునని, అందుకే పెన్షన్ కోసం ఉద్యమిస్తున్న వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానన్నారు. 

త్వరలో ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షం కానున్న పవన్ కళ్యాణ్

Submitted by arun on Sat, 10/27/2018 - 15:04

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటికే ట్విటర్ ఫేస్ బుక్ పేజీలు ఓపెన్ చేసిన పవన్. ఇక ఫేస్ బుక్ ఎకౌంట్ కూడ ఓపెన్ చేయబోతున్నాడు ఫ్యాన్స్ కోసం ఫేస్ బుక్ ఏకౌంట్ ఓపెన్ చేసి లైవ్ ద్వార జనసేన కార్యకర్తలను, అభిమానులను లైవ్ ద్వార పలకరించబోతున్నారు. ట్విటర్ ద్వార అప్పుడప్పుడు స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను ప్రత్యక్షంగా కలసి వారితో చాట్ చేయబోతున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించి డిజైన్స్ కూడ రెడీ చేసినట్టు తెలుస్తుంది వారంలో ఒకటి లేద రెండు సార్లు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లైవ్ ద్వార మాట్లాడలని చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ప్రయోగాల పుట్ట “జాని” సినిమా చిట్టా

Submitted by arun on Wed, 10/24/2018 - 14:57

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం పెద్ద సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది ఒక  వైఫల్యంగా ఈ చిత్రం పేరు తెచ్చుకొన్నది. అయితే ఈ సినిమాలో పవన్ చాల ప్రయోగాలూ చేసాడు అందులో.. మొదటిది.. లైవ్ రికార్డింగ్, అంటే ..సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు. రెండోది...రీ-మిక్స్ పాట... అది  చిట్టి చెల్లెలు చిత్రంలోని ఈ రేయి తీయనిది గీతాన్ని రీ-మిక్స్ చేశారు.

ఆసక్తిగా మారిన పవన్‌- మాయవతిల సమావేశం

Submitted by arun on Wed, 10/24/2018 - 11:17

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కొద్దిసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతిని ఆయన కాసేపట్లో కలవనున్నారు. కాంగ్రెస్‌తో  బీఎస్పీ విభేదిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ భేటి కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే ఇరు పార్టీల మధ్య గతంలోనే చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ ఏడాదిలో మార్చిలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు పవన్‌తో భేటి అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.