East Godavari

వరద నీటిలో కొట్టుకొచ్చి... ఓ ఇంట్లోకి దూరిన పాము

Submitted by arun on Wed, 08/22/2018 - 10:37

ఒకవైపు వరద నీటిలో మగ్గుతుంటే మరోవైపు ఆ వరద నీటిలో కొట్టుకొస్తున్న విష సర్పాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకొచ్చి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న విష సర్పాలతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పలువురు బలైపోయారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము బుసలు కొడుతూ ఇంట్లోని వారందరినీ భయపెట్టింది. విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గుతోన్న జనాన్ని నాగుపాము బెంబేలెత్తించింది. మూడు గంటలపాటు ఇంట్లోనే తిష్టవేయడంతో ఆ ఇంటి వాసులకు చుక్కలు కనిపించాయి. చివరికి స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు. 

సెన్సేషనల్ కామెంట్లతో వేడి పెంచిన జగన్

Submitted by arun on Tue, 08/07/2018 - 14:24

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  ఎక్కువ రోజులు గోదావరి జిల్లాలోనే పాదయాత్ర సాగించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసి ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. నెరవేర్చగలిగిన వాగ్దానాలనే ఇస్తూ, తన విశ్వసనీయతను మరోసారి నిలబెట్టుకునే దిశగా వైసిపి అధినేత అడుగులు వేస్తున్నారా? పార్టీని అధికారంలోకి తెచ్చే జిల్లాలో జగన్ టూర్ వాడి, వేడిగా సాగింది. బుధవారం ముగియనున్న జగన్ తూర్పు గోదావరి పర్యటనపై ఓ రౌండ్ అప్..

పవన్ వ్యూహంపై విశ్లేషకుల్లో నెలకొన్న ఆసక్తి

Submitted by arun on Sat, 07/14/2018 - 11:00

ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి ప్రజల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో రెస్ట్‌లో ఉన్న పవన్ ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ పోరాట యాత్రను తిరిగి ప్రారంభించపోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రను పూర్తి చేసిన పవన్ నెక్ట్ గోదావరి జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నారు. 

ఆ స్కూల్లో ఒక్కడే స్టూడెంట్

Submitted by arun on Sat, 07/07/2018 - 12:02

కార్పొరేట్ కాన్వెంట్‌ల దెబ్బకు సర్కారి బడులు చిన్నబోతున్నాయి. ఏటికేడు తగ్గుతున్న విద్యార్ధులతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ‌్నార్ధకంగా మారుతోంది. పలు చోట్ల విద్యార్ధుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. పశ్చిమ గోదావరి జల్లాలో ఒక్క విద్యార్ధి కోసం పాఠశాలను నడుపుతున్నారు. 

ఏపీలో ఎండాకాలం సెలవులు

Submitted by arun on Tue, 06/19/2018 - 12:27

తూర్పు గోదావరి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.వానాకాలంలో మండు వేసవి ని తలపించే వాతావరణం చుక్కలు చూపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో సర్కార్ స్కూళ్లకు మూడురోజులు సెలవులు ప్రకటించింది.  మంగళవారం నుంచి 21వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకూ మినహాయింపు లేదు. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దుచేస్తాం’ అని హెచ్చరించారు.

జడ్పీ సమావేశంలో రగడ..ఎమ్మెల్యే మీదకు నేమ్ ప్లేట్స్‌ విసిరిన సుబ్రహ్మణ్యం

Submitted by arun on Thu, 05/24/2018 - 14:11

ప్రొటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సభ్యుల మధ్య రసాభాసకు దారి తీసింది. కడప నగరంలో జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ గూడూరు రవి అద్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ప్రొటోకాల్ పై చర్చ జరిగింది. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను కాదని.., ఓటమి పాలైన వరదరాజుల రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలి వివాదానికి దిగారు. చివరి కలెక్టర్‌ హరికిరణ్‌ జోక్యం చేసుకోవడంతో... వివాదానికి తెరపడింది.

బిచ్చమెత్తుకోవడం... పూజారితో కొట్టించుకోవడం జాతర స్పెషల్‌

Submitted by arun on Mon, 01/29/2018 - 13:29

భిక్షాటన చేస్తూ మొక్కులు చెల్లించుకోవడం పూజారితో భక్తులు కొట్టించుకోవడం ఇలా ఎన్నో విశేషాలు, వింతలు కలిగివున్న అద్భుతమైన జాతర.. తూర్పుగోదావరి జిల్లాలోని సత్తెమ్మ తల్లి జాతర. కొప్పవరంలో కర్రి వంశీయుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న సత్తెమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్ల కొకసారి జరిగే వేడుకల్లో స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చిన అమ్మవారిని దర్శించుకుంటారు. 

రంజు మీద పుంజు

Submitted by arun on Thu, 12/28/2017 - 11:25

కాళ్ళకు ఇంకా కత్తులు కట్టకుండానే బలిసిన కోడి పుంజులు కొట్లాటకు దిగుతున్నాయి. జీడిపప్పు, పిస్తా మేస్తూ ఎక్సర్ సైజ్‌లు చేస్తూ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పందెం రాయుళ్ళు ఎవరి సన్నాహల్లో వారు సిధ్ధమవుతున్నారు. కోడి పందెలతో సంకాంత్రిలో మరింత జోష్ నింపనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలపై హెచ్ ఎంటీవీ స్పెషల్ స్టోరీ.