chiranjeevi

చిరంజీవి అసలు పేరు

Submitted by arun on Fri, 09/14/2018 - 12:34

మెగాస్టార్ చిరు గా పిలుచుకునే చిరంజీవి అసలు పేరు మీకు తెలుసా? చిరు అసలు పేరు “శివ శంకర వర ప్రసాద్” గా ఆయన పేరు పెట్టారు. తను  ఆగస్టు 22, 1955 న మోగుల్టోరులో జన్మించాడు. తను ఒన్గోల్ జూనియర్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ అధ్యయనాలు చేశాడు. ఆ తర్వాత  నార్సాపూర్ వైయస్ ఆర్ కాలేజీలో తన B.Com చేశాడు. అక్కడి నుండి సైరా వరకు పెద్ద ప్రయాణమే చేసారు. ఇక సైర విడుదల కోసం అభిమానులు ఎదురు చుస్తున్నారు. శ్రీ.కో.

స్టార్ ఆఫ్ ది డే.. మార్క్‌ ‘శంకర్‌’ పవనోవిచ్‌!

Submitted by arun on Thu, 08/23/2018 - 09:18

చిరంజీవి 63వ జన్మదిన వేడుకలను మెగా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో చిరంజీవి ఇంటి వద్ద అభిమానుల సందోహం కనిపించింది. తనను కలవడానికి ఇంటి ముందుకు వచ్చిన అభిమానులను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. పవన్‌కల్యాణ్‌ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తోపాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు ఉన్నారు. పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ ఈ ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గత ఏడాది అక్టోబర్ 10న పుట్టిన ఈ బుడతడు.. అప్పట్లో నాన్న చేతుల్లో పొదివిపట్టుకున్నప్పటి ఫొటోలో మెరిశాడు.

చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్ దంపతులు

Submitted by arun on Wed, 08/22/2018 - 15:46

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 63వ పుట్టిన రోజు వేడుకలను నేడు జరుపుకుంటున్నారు, తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి టాలీవుడ్ సినీ రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి చిరంజీవిని కలిశారు. చిరంజీవికి పవన్‌కల్యాణ్, అన్నాలెజినోవా దంపతులు పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

చిరంజీవి వేసుకున్నపునాది రాళ్లు

Submitted by arun on Wed, 08/22/2018 - 15:34

ఆరోజుల్లో చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత,  చిరంజీవి 1978 లో పునాది రాళ్లు సినిమా మొదటిసారిగా నటించార్డు. ఇదే మెగా స్టార్  చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. శ్రీ.కో.

Image result for chiranjeevi Punadhirallu

వరప్రసాద్ చిందేస్తే... చిరు

Submitted by arun on Wed, 08/22/2018 - 15:27

మీకు తెలుసా ? చిరంజీవి గా ప్రసిద్ధి చెందినా మన మేగా స్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు. శ్రీ.కో.
 

మామని చూసి విజేత అయిన అల్లు అర్జున్

Submitted by arun on Sat, 08/18/2018 - 13:13

హీరోగా పరిచయమవ్వక ముందు మన స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” తన అబిమాన హీరో అయిన  చిరంజీవిగారి  "విజెతా" సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. అప్పుడే మామయ్యని చూసి ప్రబావితము అయినట్టునాడు, అందుకే డాన్స్ ఇరగదిస్తూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.  శ్రీ.కో.

మెగా గ్రీన్ ఛాలెంజ్ తీసుకున్న పవర్ స్టార్

Submitted by arun on Thu, 08/02/2018 - 15:24

వెండితెర గ్యాంగ్ లీడర్ చేసెను,
తమ్ముడితో ఒక గ్రీన్ ఛాలెంజ్,
మొక్కలంటే నాకు తొలిప్రేమ అని,
నాటేను మన గబ్బర్ సింగ్  నేడే. శ్రీ.కో

అగ్ర కథానాయకుడు చిరంజీవి విసిరిన హరిత సవాలు (గ్రీన్‌ ఛాలెంజ్)‌ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు.
 

జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ...?

Submitted by arun on Sat, 07/14/2018 - 12:23

గత కొద్దికాలంగా పొలిటికల్ స్క్రీన్ పై సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సిధ్దమవుతున్నారా జనసేనలో చిరు కీ రోల్ ప్లే చేయబోతున్నారా ఇప్పటికే మెగా అబిమానులను జనసేనలోనికి పంపిన మెగాస్టార్ తాను కూడా జనసేన స్ర్కీన్ పై కన్పించబోతున్నారా.

జనసేనకు మెగా ఫ్యామిలీ మద్దత్తు... త్వరలోనే....

Submitted by arun on Sat, 07/07/2018 - 10:49

జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు క్రమంగా శక్తి పుంజుకుంటోందా ? పవన్‌కు మెగాబ్రదర్స్‌కు తోడవుతున్నారా ? చిరంజీవి ఫ్యాన్స్‌ను లీడ్ చేసే స్వామి నాయుడుతోపాటు మెగా అభిమానులు జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. 

మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 11:34

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, తాను కూడా బాధితురాలినేనంటూ పోరాటం సాగిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని టాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేస్తున్నారని టాలీవుడ్‌లో శ్రీరెడ్డి మరో బాంబు పేల్చారు. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించారు.