bypoll

బీజేపీకి కష్టకాలం మొదలైందా..ఉప ఎన్నికల్లో వరుస ఓటమికి కారణమేంటి..?

Submitted by arun on Fri, 06/01/2018 - 11:07

నాలుగేళ్ళ ఏడాది క్రితం వరకు తనకు ఎదురు లేదని భావించిన బీజేపీకి కష్టకాలం మొదలైందా..? ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడానికి కారణమేంటి..? మోడీ మేనియా తగ్గిందా..? అమిత్‌ షా మ్యాజిక్ పని చేయడం లేదా..? విపక్షాల ఐక్యతే కమల నాథుల కొంప ముంచుతోందా..? మొత్తంగా 2019 ఎన్నికల్లో మోడీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనా..?

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి

Submitted by arun on Thu, 05/31/2018 - 16:15

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా...లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ భంగపడింది. మూడు సిట్టింగ్‌ లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని మాత్రమే నిలుపుకోగలిగింది. ఉత్తర ప్రదేశ్‌‌లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబస్సుమ్‌ విజయ ఢంకా మోగించారు. కైరానాలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మద్దతుతో ఆర్‌ఎల్డీ గెలిచింది. మహారాష్ట్రలోని భండారా-గోండియా లోక్‌ సభ స్థానంలో బీజేపీ కంటే ఎన్సీపీ అభ్యర్థి ముందజలో ఉన్నారు.

ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో వినూత్న దందా.. ఒక్కో ఓటుకు రూ 10 వేల రూపాయలు..

Submitted by arun on Wed, 12/27/2017 - 17:01

తమిళనాడు లోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో భారీగా డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. దినకరన్ వర్గం ఒక్కో ఓటుకు సుమారు 10 వేల వరకు చెల్లించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమేనన్నట్టుగా కొన్ని ఆధారాలు కూడా బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దినకరన్ కు సహకరించిన వారిలోనే కొంత మంది మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.