tamil nadu

లిఫ్ట్‌లో లైంగికవేధింపులు.. అర్ధరాత్రి హల్ చల్

Submitted by chandram on Sat, 11/24/2018 - 14:03

ఉత్తరప్రదేశ్‌ లోని బీఈ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రెండో సంవత్సరం విద్యార్థిని పరి‍క్ష రాయడానికి లిఫ్ట్‌లో కిందకు వస్తుంది ఇదే క్రమంలో వర్సిటీ పారిశుధ్య కార్మిక యువకుడు అదే లిఫ్ట్‌లో ఎక్కి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దింతో విద్యార్థిని భయపడిపోయి కేకలు పెట్టగా అతను పారిపోయాడు. దింతో విద్యార్థిని వార్డన్‌కు ఫిర్యాదు చేసింది. సీసీ పుటేజీలు పరిశీలించగా అర్జున్‌ అనే కార్మికుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఇంతజరిగిన దుండగుడిపై చర్యలు తీసుకొకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాత్రి 9 గంటల హాస్టల్‌ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

ఉచితబియ్యం పథకంపై మద్రాస్ హైకోర్టు మెట్టికాయ‌లు

Submitted by chandram on Fri, 11/23/2018 - 15:33

తమినాడు సర్కార్ ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఉచిత బియ్యం పథకాన్ని మద్రాస్ ‍హైకోర్టు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించింది. ఇలాంటి పథకాలు చేపడితే రాష్ట్రంలో ప్రజలు మరీ బద్దకస్తులుగా తయారైతని మోట్టికాయలు వెసింది. ఇక ఇలాంటి ఉచిత పథకాలు చేపట్టినంత కాలం ప్రజలు కాలుమీద కాలువేసుని ఉంటారని, పని కూడా వెళ్లల్సిన పని లేదని, ఉచిత పథకాలు ప్రజలు ఆకర్షితులై దిన కూలికి సైతం వెళ్లడంలలేదని మద్రాస్ హైకోర్డు మండిపడింది. ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి తాము వ్యతిరేకం కాదని అయితే ఇలాంటి పథకాలు పేద నీరుపేద వర్గాలకు చెందితే సంతోషమేనని స్పష్టం చేసింది.

శవాన్ని పీక్కుతున్న పిల్లి.. ప్రభుత్వ ఆస్పత్రి వైనం

Submitted by chandram on Wed, 11/21/2018 - 17:19

ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు హడలిపోతారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారన్న భావన స్థిరపడిపోయింది. ఇలాంటి ఘటనే కోయంబత్తూర్ జిల్లా సర్కారు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా వార్డులో ఒక మహిళా రోగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చనిపోయింది. చనిపోయిన మహిళ వివారాలు తెలియకపోవడంతో వార్డులోనే శవాన్ని పక్కకు పెట్టారు. శవాన్ని శవపరి‍‍క్షకు పంపకుండా కటిక నెలపై ఎమీ తెలియనట్లుగా మూలన పడెసారు. కాగా ఆసుపత్రి ప్రగంణ పరిసరాల్లో ఉండే పిల్లి శవాన్ని గమనించి ఇక శావాన్ని పిక్కతినడం మొదలు పెట్టింది.

తమిళనాడుకు ముంచుకొస్తున్న మరో ముప్పు

Submitted by arun on Tue, 11/20/2018 - 13:15

‘గజ’ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు  మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశ మున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతికి మారిందని, ఇది మరింత స్థిరపడనుందని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయు గుండంగా మారి బలపడే అవకాశముందన్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తదితర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని సూచించారు. వచ్చే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశమున్నందున జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

Submitted by arun on Sat, 11/17/2018 - 16:41

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

తమిళనాడులోనూ ఐటీ దాడులు...ఏక కాలంలో వంద చోట్ల సోదాలు

Submitted by arun on Thu, 10/25/2018 - 12:32

తమిళనాడు ఇసుక మాఫియాపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో దాదాపు 100 ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు. నాలుగు ఇసుక మైనింగ్ కంపెనీల యజమానులు, వారి బంధుమిత్రులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. న్యూస్ 7 అధినేత వైకుందరాజన్, వీవీ మినరల్ కంపెనీ, మణికందన్, చంద్రసేన్, సుకుమార్ తదితరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. సముద్రపు ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం సేకరించిన అధికారులు, ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు ఊహించని షాక్...!

Submitted by arun on Fri, 10/12/2018 - 16:56

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ జగదీశ్ ఇవాళ తీర్పు వెలువరించారు. పారదర్శక విచారణ కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగించామన్న ధర్మాసనం మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. హైవే ప్రాజెక్టుల కేటాయింపులో  పళనిస్వామి అవినీతి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డీఎంకే ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత హైకోర్టు ఈమేరకు స్పందించింది. 

తల్లి శవంపై కూర్చుని అఘోర పూజలు

Submitted by arun on Wed, 10/03/2018 - 14:40

తన తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించడం తమిళనాడులో కలకలం సృష్టించింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన మణికంఠన్‌ అఘోరా.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూన్న అతని తల్లి మేరీ మరణించింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మణికంఠన్ 20 మంది అఘోరాలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ మణికంఠన్‌ తల్లి శవంపై కూర్చున్నాడు.

గుట్కా స్కాం ప్రకంపనలు...మంత్రి, ఐపీఎస్ అధికారుల ఇళ్లపై సీబీఐ దాడులు

Submitted by arun on Wed, 09/05/2018 - 12:51

గుట్కా కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు తమిళనాడులోని చెన్నైలో దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్ నివాసంతో పాటు మొత్తం 40చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా సీనియర్ అధికారులు, అధికార అన్నాడీఎంకే నేతల ఇళ్లపై దాడులు చేసిన సీబీఐ, పోలీస్ అధికారులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులను ముమ్మరం చేశారు.

ముగిసిన సీనియర్ల శకం...ఆ లోటును భర్తీ చేసేదెవరు?

Submitted by arun on Thu, 08/09/2018 - 10:14

ఇన్నాళ్లూ ఆయన తమిళనాడుకు  పెద్ద దిక్కుగా ఉండేవారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా తమిళనాడు ప్రజలు ఎంతో భరోసాతో బతికారు  క్రియాశీలక రాజకీయాల్లో కరుణానిధి లేకపోయినా, తమిళనాడు ప్రజలు ఒక రకమైన ధైర్యాన్ని పొందారు కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. ప్రజలకు దారి చూపి నడిపించే నేత కరువయ్యాడా?

Tags