Rajinikanth

రజనీకాంత్‌‌ బలంపై సీ-ఓటర్ సర్వే

Submitted by arun on Sat, 01/20/2018 - 15:46

తమిళనాడులో రజనీకాంత్‌ కింగ్‌ మేకర్‌గా అవతరిస్తారని సీ-ఓటర్ సర్వేలో తేలింది. దాదాపు 34శాతం ఓట్లతో 23 పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుని దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతారని పేర్కొంది. అలాగే 28శాతం ఓట్లతో డీఎంకేకు 14 ఎంపీ స్థానాలు దక్కుతాయని తేల్చింది. ఇక అధికార అన్నాడీఎంకే మాత్రం దారుణంగా దెబ్బతింటుందని చెప్పింది. అన్నాడీఎంకే ఓట్‌ షేర్‌ 13శాతానికి పడిపోతుందన్న సీ-ఓటర్‌ కేవలం రెండంటే రెండే పార్లమెంట్ సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది.

త‌మిళ‌నాడులో మ‌రో చిరంజీవి

Submitted by lakshman on Thu, 01/18/2018 - 07:53

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు  ఏడాది స‌మ‌యం ఉన్నా కొన్ని సంస్థ‌లు నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజకీయాల్లో వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ర‌జ‌నీ కాంత్ ఏమేర‌కు రాణిస్తారు. త‌మిళ‌నాడు సీఎం అవుతారా. అయితే ఎన్నిసీట్లు గెలుచుకుంటారు. పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా లేదా సొంతంగా పోటీ చేయాలా. ర‌జ‌నీ పోటీ చేస్తే ఏ పార్టీ ఓట్లు చీలుతాయి. ఏ పార్టీకి ల‌బ్ధి చేకూరుతుంది 

ఒకే వేదికపై దర్శనమిచ్చిన కమల్,రజనీ

Submitted by arun on Wed, 01/17/2018 - 17:55

తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్‌ హాసన్‌లో ఒకే వేదికపైకి వచ్చారు. ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానంటూ కమల్ క్లారిటీ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటలకే లోకనాయకుడు కమల్, దళపతి రజనీకాంత్‌లు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రజనీకాంత్...రాజకీయ ఆరంగేట్రానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని మీడియా...ప్రశ్నకు వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా రాజకీయాల్లో భాగమేనన్నారు. 
 

కోలుకోలేని దెబ్బ కొడుతున్న రజినీకాంత్

Submitted by arun on Thu, 01/11/2018 - 14:40

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పుడు సౌత్ లో ఎవరూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు. ఎవరూ ఊహించని షాక్ ఇస్తున్నాడు. పాలిటిక్స్ లోకి ఎంటరవ్వటం పెద్ద సర్ ప్రైజ్ కాకపోయినా, అంతకు మించే సర్ ప్రైజ్ తో అభిమానుల్ని ఆందోళనలోకి నెట్టాడు. ఇక సెలవుని ప్రకటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీ కాంత్, నడిస్తే స్టైలే, నడవకుండా నిలుచున్నా స్టైలే విజిలేసినా స్టైలే, సిగరెట్ కాల్చినా స్టైలే, ఆఖరికి గుండు తో కనపించినా, స్టైలే అసలు రజినీ అంటేనే స్టైల్ కాని ఇప్పుడు అవన్నీ మిస్సయ్యే పరిస్థితొచ్చింది

చిరూ దెబ్బ‌ ర‌జ‌నీకి త‌గ‌ల‌కుండా ఉంటుందా

Submitted by arun on Fri, 01/05/2018 - 14:37

ర‌జ‌నీ రాజ‌కీయం పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో పార్టీ పెట్టిన మెగ‌స్టార్ చిరంజీవికి రాజ‌కీయం ఎలాంటి చేదు అనుభ‌వాల్ని మిగిల్చిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. చిరంజీవికి  త‌గిలిన ఎదురు దెబ్బ‌లు ర‌జ‌నీకాంత్ కు త‌గ‌ల‌కుండా ఉంటాయా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎందుకంటే త‌మిళ‌నాట రాజ‌కీయం అంటే క‌త్తిమీద సామేన‌ని చెప్పుకోవాలి.
 

మ‌రో ప‌వ‌న్ క‌ల్యాణ్ లా ర‌జ‌నీకాంత్

Submitted by arun on Thu, 01/04/2018 - 11:47

ర‌జనీకాంత్ పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారో లేదో పొత్తు షురూ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌జనీకాంత్ డీఎంకే అధినేత క‌రుణానిధితో భేటీ అవ్వ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది. పార్టీ ప్ర‌క‌టించి ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా కాలేదు. ఇంత‌లోనే డీఎంకే తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తున్న‌ట్లు త‌మిళ‌నాట ఒక‌టే చ‌ర్చ‌. పార్టీ పెట్టేది సుప‌ర్ స్టారే అయినా...న‌డిపించేది మాత్రం మాస్ట‌ర్ బ్రెయిన్ క‌రుణానిధి అని స‌మాచారం. 

ర‌జ‌నీకాంత్ పై పోటీ చేసి ఆయ‌న్ని ఓడిస్తా : ప‌్ర‌ముఖ‌ డైర‌క్ట‌ర్

Submitted by arun on Tue, 01/02/2018 - 12:39

ఉత్కంఠకు తెరపడింది. కోట్లాది మంది అభిమానులు, తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ప్రకటి కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందుస్పష్టత ఇచ్చేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాట్లుగా అధికారికంగా ప్రకటించారు.

రజినీకి కలిసొచ్చేవేంటి?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:08

45 ఏళ్ల వయసులో రాజకీయంగా అవకాశమొచ్చినా వదులుకున్నాను, 68 ఏళ్ల వయసులో పదవిపై ఆశ ఉంటుందా అని రజినీకాంత్ అన్నారు. మరి పాలిటిక్స్‌లోకి అప్పుడు రాని రజినీ, ఇప్పుడెందుకు వస్తున్నారు...రజినీకి కనిపిస్తున్న నాలుగు అనుకూలతలేంటి...న్యూఇయర్‌లో న్యూపార్టీ అంటున్న రజినీకి కలిసొచ్చేవేంటి?

స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:01

దేవుడు ఆదేశిస్తాడు...అరుణాచలం పాటిస్తాడని, నాడు సినిమాలో నేడు, పొలిటికల్‌ లైఫ్‌లోనూ చెప్పాడు రజినీకాంత్. ఆధ్యాత్మిక పాలిటిక్స్ చేస్తానంటున్న రజినీని, ఆదేశించింది దేవుడు కాదు, నరేంద్ర మోడీ అంటున్నవారి విమర్శలూ అనేకం. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత...రజినీకాంత్‌కు ప్లస్సులేనా...మైనస్‌లూ ఉన్నాయా?

కొత్త ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్న తలైవా

Submitted by arun on Tue, 01/02/2018 - 10:59

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్నారు. సంక్రాంతి పండగకు కొత్త పార్టీని ప్రారంభించేలా తలైవా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పార్టీ గుర్తు, సిద్ధాంతాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తలైవా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందన్నారు.