Rajinikanth

రజనీ చేతుల మీదుగా మహేష్‌ మల్టీప్లెక్స్‌

Submitted by chandram on Tue, 11/13/2018 - 17:01

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నడనే విషయం తెలిసిందే. అయితే ఏసియన్ ఫిలింస్ సంస్థతో మహేష్ ఈ మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఏయంబీ సినిమాస్ పేరుతో నిర్మిస్తున్న2.ఓ సినిమాతో ప్రారంభించాలని సన్నాహాలు చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ థియేటర్స్ కావడంతో 2.ఓ లాంటి 3డీ విజువల్,4డీ ఆడియోతో ప్రారంభించమే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లుగా తెలిస్తుంది. కాగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరవుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది. 

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.......:రజినీ

Submitted by chandram on Tue, 11/13/2018 - 12:51

బీజేపీ పార్టీపై తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, సానుకూలంగా ఉండే రజినీ ఇప్పుడు బిన్న వ్యాఖ్యలు చేయడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలన్నీ అన్ని బీజేపీపై తీవ్రవ్యతిరేకతో కూటమి ఏర్పడుతున్నాయి, అంటే బీజేపీ ఎంత ప్రమాదకరమైన పార్టీయో అర్థమౌతుంది. ఇటివల పెద్దనోట్ల రద్దుపై ప్రధానిమోడీ సంచలన నిర్ణయానికి రజినీకాంత్ సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పుడు పెద్దనోట్లుపై ఘాటువ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రజలు నానాపాట్లు పడుతున్నారని తెలిపారు.

రజనీకాంత్‌ ఇంట్లో విషాదం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:14

సౌతిండియా సూపర్ స్టార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న సత్యనారాయణన్ భార్య కళావతీ బాయి (70) బెంగళూరులో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, ఆమెను కడసారి చూసేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. రజనీకాంత్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు. రజనీకాంత్‌ను చెన్నైకి పంపి, నటుడయ్యే వరకూ ఆయన బాగోగులు అన్నయ్య వదినలే చూసుకున్నారు. ఇదిలాఉండగా రజనీకాంత్‌ వదిన కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు.

మా నాన్న సినిమాలు మానేస్తే బెటర్‌!

Submitted by arun on Tue, 06/12/2018 - 13:49

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బావుంటుందని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..తన నటన ద్వారా ప్రేక్షకులను సంతోషపెడుతున్న రజనీ పూర్తిగా సినీ రంగంపైనే దృష్టిసారించడం తగదని అన్నారు. తన తండ్రిని ఇప్పటికిప్పుడు సినిమాలు పూర్తిగా మానేయాలని తాను కోరుకోవటం లేదు కానీ.. దశల వారీగా మానేయాలని కోరుతున్నానని చెప్పారు. ఎందుకంటే.. రజనీ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్నికేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. సంతోషం వస్తే పొంగిపోకూడదని..

కాలా మూవీలో నటించిన కుక్కకు భారీ డిమాండ్

Submitted by arun on Fri, 06/08/2018 - 12:25

కాలా సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో రజినీకాంత్‌ యాక్షన్‌కు జనం ఫిదా అవుతున్నారు. సినిమాలో కాలా పక్కన నటించిన కుక్క...రాత్రిరాత్రికే స్టార్‌ డమ్ సంపాదించుకుంది. మూవీలో మనీ అనే కుక్కతో జనం ఫోటోలు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. రజినీకాంత్‌తో పాటు మనీ అనే కుక్క సింగిల్‌ టేక్‌లో సీన్లను చేసినట్లు యజమాని తెలిపారు. మూవీలో నటించిన తర్వాత మనీని 2 కోట్లకు కోనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందుకు వచ్చారు. అయితే దాని యజమాని మాత్రం కుక్కను అమ్మే ప్రసక్తే లేదని చెబుతున్నారు. 

కర్నాటకలో కాలా మూవీ విడుదలకు లైన్ క్లియర్

Submitted by arun on Tue, 06/05/2018 - 16:40

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీ కర్ణాటకలో విడుదలకు లైన్‌ క్లియరైంది. సినిమా విడుదలకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. కావేరీ జలాలను తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాలంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ అనుకూల సంస్థలు కాలా విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో కాలా మూవీ విడుదలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ...ఎలాంటి అవాంచనాలు కలకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

రజనీకాంత్ రాజకీయాల్లో.. కుటుంబసభ్యులు!!

Submitted by arun on Fri, 03/16/2018 - 15:29

రాజకీయ పార్టీ పెడతా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తా అని ప్రకటించి సంచలనానికి తెర తీసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసేస్తున్నారు. మానసిక స్థైర్యం అందుకునేందుకు ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న రజనీ.. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నారు.

రజనీ.. కమల్ కు పోటీగా కొత్త పార్టీ

Submitted by arun on Mon, 03/12/2018 - 12:36

తమిళనాడు రాజకీయం ఇప్పుడు రంజుమీదుంది. ఓ వైపు రాజకీయాల్లో అడుగులు వేసేందుకు రజనీకాంత్ ఎత్తులు వేస్తుంటే.. అంతకు ముందే మేల్కొన్న కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీని పెట్టి.. జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు.. ఈ ఇద్దరికీ పోటీగా.. నేనున్నా అంటూ వచ్చేస్తున్నారు.. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన శశికళ మేనల్లుడు దినకరన్.

ముందుంది.. రజనీకాంత్ అసలు స్కెచ్!

Submitted by arun on Fri, 03/09/2018 - 15:28

తమిళనాడులో మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకుపోతున్నారు.. కమల్ హసన్. అధికారమే ధ్యేయంగా ఆయన అన్ని ఎత్తులూ వేస్తున్నారు. ఇదే సమయంలో.. కమల్ కంటే రాజకీయాల్లో ప్రవేశంపై ముందే క్లారిటీ ఇచ్చి.. ఇప్పటికీ పార్టీ పెట్టకుండా సమయాన్ని గడిపేస్తున్నారు.. రజనీకాంత్. ఓ వైపు కమల్ జనాల్లోకి వెళ్తుంటే.. ఇటు రజనీ మాత్రం ఎందుకిలా చేస్తున్నారన్న చర్చ.. సర్వత్రా జరుగుతుతోంది.

రజనీకాంత్‌‌ బలంపై సీ-ఓటర్ సర్వే

Submitted by arun on Sat, 01/20/2018 - 15:46

తమిళనాడులో రజనీకాంత్‌ కింగ్‌ మేకర్‌గా అవతరిస్తారని సీ-ఓటర్ సర్వేలో తేలింది. దాదాపు 34శాతం ఓట్లతో 23 పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుని దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతారని పేర్కొంది. అలాగే 28శాతం ఓట్లతో డీఎంకేకు 14 ఎంపీ స్థానాలు దక్కుతాయని తేల్చింది. ఇక అధికార అన్నాడీఎంకే మాత్రం దారుణంగా దెబ్బతింటుందని చెప్పింది. అన్నాడీఎంకే ఓట్‌ షేర్‌ 13శాతానికి పడిపోతుందన్న సీ-ఓటర్‌ కేవలం రెండంటే రెండే పార్లమెంట్ సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది.