telangana

ఉద్యమకారులకు కాంగ్రెస్‌ మొండిచేయి... మరి నెక్స్ట్‌ ఏంటి?

Submitted by santosh on Sat, 11/10/2018 - 12:04

తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమకారులకు మొండి చెయ్యి చూపించిచేలా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు ఉద్యమాలు చేసి ఉద్యమపార్టీలో టిక్కెట్టు రాక కాంగ్రెస్ గూటికి చేరినా... ఉద్యమకారులను హస్తం పార్టీ పట్టంచుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలో పార్టీ గొంతుకగా పనిచేసిన పొత్తుల పేరుతో ఉద్యమ నాయకులుగా పేరును నేతలకు టిక్కెట్టు దక్కేలా కనపించడం లేదు. దీంతో పార్టీ నిన్న మొన్నటి వరకు హుషారుగా కనిపించిన నేతలంతా నైరాష‌్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. 

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాపై అధినేత రాహుల్ గాంధీ అసంతృప్తి

Submitted by arun on Fri, 11/09/2018 - 13:35

వారాల తరబడి సమీక్షలు, రోజులకు రోజులు చర్చలు సాగించి  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాబితాను పున: పరిశీలించాలంటూ కేంద్ర ఎన్నికల కమిటీని ఆదేశించారు.  తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రంగా నిలిచిన ఓయూ విద్యార్ధులకు టికెట్లు ఎందుకు కేటాయించలేదని రాహుల్ ప్రశ్నించారు. దీంతో కమిటీ సభ్యులు సమాధానం చెప్పలేక  సీఈసీ సభ్యులు నీళ్లు నమిలారు. మొత్తం అభ్యర్ధుల జాబితాను వెనక్కు పంపిన రాహుల్  పూర్తి స్ధాయిలో పరిశీలించి కొత్త జాబితాను సిద్ధం చేయాలంటూ ఆదేశించారు.  
 

తెలంగాణలో మావోయిస్టుల కలకలం...పలువురు ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు

Submitted by arun on Fri, 11/09/2018 - 10:35

తెలంగాణలో విధ్వంసానికి మావోయిస్టులు కుట్ర చేస్తున్నారా ?  ఎన్నికళ వేళ హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా ? ఎన్నికలను బహిష్కరించాలంటూ మండల కేంద్రాల్లో సైతం ప్రచారం చేయడం ద్వారా మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారా ?  ఏపీ తరహాలోనే ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత ..?  

వంద సీట్లు సాధించడమే కేసీఆర్ లక్ష్యం: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Submitted by arun on Thu, 11/08/2018 - 15:55

ఎన్నికల్లో వంద సీట్లను సాధించడమే తమ ముందున్న లక్ష్యమని వనపర్తి టీఆర్ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని అంకూర్‌, వెంకటాపూర్‌, చిన్న గుంటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన నిరంజన్‌రెడ్డికి మహిళల నుంచి పెద్దఎత్తున స్వాగతం లభించింది. టీఆర్ఎస్‌ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని లాభసాటిగా వ్యవసాయం చేసుకుంటున్నారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. 
 

కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు

Submitted by arun on Thu, 11/08/2018 - 12:11

అనుకున్న సమయానికి కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. వరుసగా రెండు రోజుల నుంచి సమావేశమవుతున్న కమిటీ సభ్యులు నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 29 సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన 90 నియోజకవర్గాలకు గాను 57 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని  తుది జాబితాలోని అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఎవరూ లేరంటూ నిర్ధారణకు వచ్చారు

సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ ఉంటే చాలు: కవిత

Submitted by arun on Wed, 11/07/2018 - 10:37

జగిత్యాలను జిల్లాగా చూడాలనే ప్రజల 40 ఏళ్ల కలను కేసీఆర్ నెరవేర్చారని ఎంపీ కవిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడొచ్చి ఆగం పట్టియ్యాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్, కవిత సమక్షంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన గౌడ సంఘం నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎంపీ కవిత జీవన్ రెడ్డిపై విమర్శల వర్షం గుప్పించారు. జీవన్ రెడ్డి చేయని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. జీవన్ రెడ్డి అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు

Submitted by arun on Mon, 11/05/2018 - 14:42

ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తవుతుందని ఏపీ సర్కార్ వివరణ ఇచ్చింది. దీంతో జనవరి 1న ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, మౌలిక వసతులు పూర్తయ్యాక విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని వ్యాఖ్యానించింది. అప్పటి వరకు జడ్జిల నివాసాలు అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 
 

తెలంగాణలో మొదలైన ఎన్నికల బెట్టింగ్‌

Submitted by arun on Sat, 11/03/2018 - 14:52

అన్ని పార్టీలలో అభ్యర్ధుల ఖరారు కాకాముందే అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బెట్టింగ్‌ల జోరందుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, అభిమానుల మధ్య జోరుగాబెట్టింగ్‌లు మొదలైనయి.సుద్దాల, క్యాతన్‌పల్లి గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు పందెం పెట్టుకున్నారు. కాగా చెన్నూరులో టీఆర్ఎస్‌ అభ్యర్థి బాల్కసుమన్‌పై కాంగ్రెస్ నేత వెంకటేశ్ ఎమ్మెల్యేగా గెలుస్తారని సుద్దాల మాజీ సర్పంచ్ పోలు చంద్రాగౌడ్ రూ.పది వేల బెట్ కట్టాడు.

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్...40 మందిని ప్ర‌చారంలోకి దింపిన గులాబి బాస్ కేసీఆర్

Submitted by arun on Sat, 11/03/2018 - 11:02

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్ కేసీఆరే అని అంద‌రు భావించారు. కాని మ‌రో 40మంది కూడా రంగంలోకి దిగారు. వాళ్లు స్టార్ క్యాంపెయిన‌ర్స్ కాదు కేటీఆర్,హ‌రిష్ ,క‌విత‌లు అంత క‌న్నా కానే కాదు. మ‌రి ఎవ‌రా స్టార్ క్యాంపెయిన‌ర్స్ అనుకుంటున్నారా.? 

Tags