ttv dinakaran

బ్రేకింగ్‌ : ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Thu, 10/25/2018 - 11:29

ఎమ్మెల్యేల అనర్హతపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 ఎమ్మెల్యేలపై  స్పీకర్ వేటు వేయడాన్ని కోర్టు సమర్ధించింది.  న్యాయస్ధానం తీర్పుతో  దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తమ అభ్యర్దిత్వాన్ని కోల్పోయారు.  తాజా తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వం పూర్తి మెజార్టీకి చేరుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రకటించారు.  

రజనీ.. కమల్ కు పోటీగా కొత్త పార్టీ

Submitted by arun on Mon, 03/12/2018 - 12:36

తమిళనాడు రాజకీయం ఇప్పుడు రంజుమీదుంది. ఓ వైపు రాజకీయాల్లో అడుగులు వేసేందుకు రజనీకాంత్ ఎత్తులు వేస్తుంటే.. అంతకు ముందే మేల్కొన్న కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీని పెట్టి.. జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు.. ఈ ఇద్దరికీ పోటీగా.. నేనున్నా అంటూ వచ్చేస్తున్నారు.. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన శశికళ మేనల్లుడు దినకరన్.

దిన‌క‌ర‌న్ కీల‌క నిర్ణ‌యం

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:48

అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కొత్త పార్టీ లాంఛ్‌ తేదీని ప్రకటించాడు. గ‌త కొంత కాలంగా దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చ‌ర్చ‌లు చ‌ర్చ‌లుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.  ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్‌ వెల్లడించనున్నారు. 

ఆర్కేనగర్‌ ఎమ్మెల్యేగా దినకరన్‌ ప్రమాణస్వీకారం

Submitted by arun on Fri, 12/29/2017 - 17:06

తమిళనాడు ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన టీటీవీ దినకరన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంచేశారు. అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్ దినకరన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆర్కేనగర్‌ పర్యటనకు దినకరన్‌ బయల్దేరి వెళ్లారు. జనవరి 8నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి సమావేశాలకు దినకరన్‌‌ కూడా హాజరుకానుండటంతో అసెంబ్లీ సెషన్స్‌ వాడివేడిగా జరగనున్నాయి. అధికార పార్టీ అన్నాడీఎంకేలో అనైక్యతతో సమావేశాలు రక్తికట్టడం ఖాయమని చెబుతున్నారు.

అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు

Submitted by arun on Mon, 12/25/2017 - 14:21

తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆరుగురు నేతలకు ఆ పార్టీ పెద్దలు ఉద్వాసన పలికారు. పార్టీ సీనియర్ నేతల సమావేశమైన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం కలిసి ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరుగురు నేతలను పార్టీ నుంచి తొలగించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్, పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగించారు.

మళ్లీ వేడెక్కనున్న తమిళనాడు రాజకీయాలు

Submitted by arun on Sun, 12/24/2017 - 18:06

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ్. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో దినకరన్‌ గెలుపుతో రసకందాయంలో పడ్డాయ్. ఉప ఎన్నికల్లో గెలిచి అమ్మకు వారసులం తామేనని అధికార పార్టీ భావించినా భంగపాటు తప్పలేదు. అటు డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్‌ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. దినకరన్‌ ఎత్తుల ముందు అధికార, విపక్షాల నేతలు చిత్తయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపుతో అమ్మకు వారసుడు తానేనని నిరూపించుకున్నాడు.

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్‌

Submitted by arun on Sun, 12/24/2017 - 17:14

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయ్‌. అమ్మ జయలలిత మృతితో ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినకరన్‌ తిరుగులేని విజయాన్ని సాధించాడు. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్‌ వరకు ప్రతి రౌండ్‌లోనూ దినకరన్‌ ఆధిక్యం సాధించి తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ఆర్కే నగర్‌లో గెలిచి దినకరన్‌కు బుద్ధి చెప్పాలనుకున్న అన్నాడీఎంకే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ గెలుపుతో జయలలితకు అసలైన వారసుడు తానేనని దినకరన్‌ నిరూపించుకున్నాడు. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం అటుంచితే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

దినకరన్‌ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్‌ కూలిపోతుంది

Submitted by arun on Sun, 12/24/2017 - 12:07

ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో స్థానంలో అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదన్, మూడో స్థానంలో డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్ ఉన్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూస్తే అన్నాడీఎంకే అభ్యర్థికి 9672, డీఎంకే అభ్యర్థికి 5091, ఇండిపెండెంట్ అభ్యర్థి దినకరన్‌‌కు 20,298 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఐదో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దూసుకుపోతున్న దినకరన్‌

Submitted by arun on Sun, 12/24/2017 - 10:46

తమిళనాడులోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కౌంటింగ్ ప్రారంభం కావడంతో అందరి దృష్టి ఆర్కే నగర్ ఓట్ల లెక్కింపుపై పడింది. అధికార ప్రతిపక్షాలతోపాటు స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌కు సెమీ ఫైనల్‌ లాంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలానా వారు గెలుస్తారని ముందస్తు సర్వేలు చెబుతున్నప్పటికీ ఆర్కేనగర్‌ ఓటర్ల నాడి ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.