Rajasthan

రాజస్థాన్ లో కమలం వాడిపోతోందా?

Submitted by arun on Tue, 10/23/2018 - 14:41

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఉంది రాజస్థాన్ లో బిజెపి పరిస్థితి ఓటమి భయం వెన్నాడటంతో పోల్ షెడ్యూల్ ను చివరికి మార్చినా ప్రచారంలో పదును పెంచినా బిజెపికి అక్కడ కష్టకాలమేననే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం వసుంధర వ్యవహార శైలిపై బిజెపి పెద్దలే మండి పడుతున్నారు.

రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:36

రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌లో ఎయిర్‌ఫోర్స్‌ విమానం మిగ్‌-27 కూలింది. మిగ్‌-27 ఒక్కసారిగా కూలడంతో.. ఘనాట స్థలంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భయపడిన స్థానికులు పరుగులు తీశారు. పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మిగ్‌-27 ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కూలడానికి గల కరణాలు తెలియాల్సి ఉంది. 

బిందెలో తలదూర్చిన చిన్నారి...బిందె నుంచి తలను తీసేందుకు విశ్వప్రయత్నం

Submitted by arun on Tue, 07/31/2018 - 11:24

పొరపాటునో గ్రహపాటునో బిందెలో తల ఇరుక్కుపోవడం  అది రాకపోతే నానా తంటాలు పడే సీన్లు సినిమాల్లో చూశాం. అక్కడ కామెడీ పండించేందుకు ఇలాంటి సీన్లు వాడుకున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఇలా బిందెలో తల ఇరుక్కుపోయిన సీన్లను సినిమాల్లో చూశాం. సినిమాలో కామెడి కోసం ఇలాంటి సీన్లు పండినా రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి సీన్ ఎదురైతే అంతా టెన్షన్ పడిపోవాల్సిందే ఇప్పుడు రాజస్థాన్ లో ఎదురైన సీన్ కూడా ఇలాంటిదే. కానీ ఇక్కడ  ఏడాది వయసు పాప  అదీ గుక్కపట్టి ఏడుస్తుండటంతో అంతా టెన్షన్ పడ్డారు. 

ఈవ్ టీజర్ భరతం పట్టిన యువతి

Submitted by arun on Wed, 07/18/2018 - 10:56

ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ యువతి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వాణి శర్మ అనే యువతి  డిఫెన్స్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించడం కోసం ప్రతి రోజు రన్నింగ్ ప్రాక్టీసు చేస్తుంది. వాణిని ఇంటర్ చదువుతున్న యువకుడు ఫాలో అవుతున్నాడు. ఆమె నా లవర్ అంటూ తన స్నేహితులకు చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న వాణిలో  ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాకింగ్ కు వచ్చిన ఓ పెద్ద మనిషి వద్ద కర్రను తీసుకొని వాణి ఆ యువకుడిని చితకబాదింది. అమ్మాయిలు చేతకాని వారు అనుకోవద్దు అని వాణి 
గట్టిగా హెచ్చరించింది.  

ప్రేమ జంటకు ఘోర అవమానం... నగ్నంగా ఊరేగింపు

Submitted by arun on Sat, 07/07/2018 - 13:17

మేజర్లు ఒకరని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే.. వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే అధికారం ఎవరికీ లేదు.. అని ఓ వైపు న్యాయస్థానాలు తీర్పులు వెలువరిస్తున్నప్పటికీ.. ప్రేమికులకు శిక్షలు తప్పడం లేదు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో ఓ జంటకు గ్రామస్థులు పెద్ద శిక్షవేశారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీనిని వినోదంగా చూశారేతప్ప ప్రేమ జంటకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా దీనిని వీడియో తీశారు.

పసికందుపై యాసిడ్‌ పోసిన మంత్రగత్తె

Submitted by arun on Sat, 03/31/2018 - 14:53

నెల వయసున్న పసికందుపై యాసిడ్‌ పోసిన ఘటన రాజస్థాన్‌లోని సవారు మాధోపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంన్ష్‌ అనే శిశువు న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ఎంతకు తగ్గట్లేదు. దీంతో తనకు తెలిసిన ఓ మంత్రగత్తె వద్దకు తన బిడ్డను తల్లి తీసుకొని వెళ్లింది. యాసిడ్‌ పోస్తే న్యూమోనియా తగ్గుతుందని భావించిన ఆ మంత్రగత్తె.. పసికందు ఛాతీపై యాసిడ్‌ పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రగత్తెను, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ మంత్రగత్తె..

అసెంబ్లీలో దెయ్యాలు ఉన్నాయ్‌..!

Submitted by arun on Fri, 02/23/2018 - 14:37

రాజస్థాన్‌ అసెంబ్లీకి ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎవరూ సరిగా హాజరు కావడం లేదు. ఒకే సారి 2 వందల మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యే సరికి విషయం ఆరా తీశారు. వాస్తవం తెలుసుకున్న జనం అవాక్కయ్యారు. ఇంతకీ రాజస్థాన్‌ అసెంబ్లీలో భారీ సంఖ్యలో గైర్హాజరవ్వడానికి కారణం ఏంటి..? ఆ అవాక్కయ్యే ఘటనేమిటి..? 

పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

Submitted by arun on Sat, 02/17/2018 - 16:12

రాజస్థాన్‌ బీవర్‌లోని నంద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఇంట్లో  గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజస్తాన్ మంత్రి ఏం చేశాడో చూడండి

Submitted by arun on Thu, 02/15/2018 - 15:25

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరో మచ్చ. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీచరణ్ సరఫ్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద బహిరంగంగా మంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనను మంత్రి కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయంకాదన్నారాయన. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. ఇదేమీ పెద్ద విషయం కాదని, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

బీజేపీ ఘోర పరాజయం!

Submitted by arun on Thu, 02/01/2018 - 18:10

రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ లో మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో కమలం వాడిపోగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటుకుంది. మందల్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, అజ్మీర్, అల్మార్ పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ జయభేరి ఎగురవేసింది. ఇక బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నవోపార, ఉల్లుబెరియా అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర వైఫల్యాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది.