nizamabad

ధర్మపురి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం

Submitted by arun on Sat, 08/04/2018 - 10:10

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనపై నిర్భయతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారు. ఇంటికి తాళాలు వేసి పరారు కావడంతో పోలీసులు గాలిస్తున్నారు. మూడు  బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, బాధిత విద్యార్థినులు మాత్రం సంజయ్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు. 

లైంగిక వేధింపుల వెనుక ఉన్నదెవరు...డీఎస్‌ కొడుకు వాదనేంటి?

Submitted by arun on Fri, 08/03/2018 - 17:43

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సంజయ్‌ తమను లైంగిక వేధించాడంటూ నేరుగా హోంమంత్రి నాయినికే ఫిర్యాదుచేసి సంచలనం సృష్టించిన శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్ధినులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు. వికృత ప్రవర్తనతో తీవ్ర వేధింపులకు గురిచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్న విద్యార్ధినులు రక్షణ కల్పించాలని సీపీని కోరారు.

యూకేజీ విద్యార్థిని కిడ్నాప్...తల్లిదండ్రుల ఆందోళన

Submitted by arun on Fri, 08/03/2018 - 12:03

నిజామాబాద్ నందిపేటలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. గీతా కాన్వెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల మల్లీశ్వరిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. చిన్నారి  కిడ్నాప్‌ మిస్టరీ వీడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వన్నెల్‌ గ్రామానికి చెందిన రమేష్, హరిత దంపతుల రెండో కూతురైన  మల్లీశ్వరీ నిన్న స్కూల్‌ కి వెళ్లి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కేటీఆర్ కు సభలో షాకిచ్చిన కవిత

Submitted by arun on Wed, 08/01/2018 - 16:58

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్ కలెక్టరేట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ కవిత పాల్గొని అన్న కేటీఆర్‌కు కొన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్ కే పరిమితమైందని ఇప్పుడు అన్ని జిల్లాలకు ఐటీ విస్తరిస్తున్నారని అన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు.

అందుకే నిజామాబాద్ కు దూరమవుతున్నారా.. ?

Submitted by arun on Tue, 07/24/2018 - 11:04

నిజామాబాద్ ఎంపీ సీటు పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలా ఉన్న ఆ నియోజక వర్గం 2014 తర్వాత టిఆరెస్ చేతిలోకి వెళ్లిపోయింది. మారుతున్న సమీకరణల్లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ అదే నియోజక వర్గంనుంచి పోటీ చేస్తారా? లేక మారతారా? బిజెపి పోటీ లోకి దిగితే ఎలా ఉంటుంది?

నిజామాబాద్ టీఆర్ఎస్ లో కలకలం

Submitted by arun on Wed, 07/18/2018 - 10:44

నిజామాబాద్ అధికార పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. కొంతకాలంగా రగిలిపోతున్న సీనియర్ నాయకులు ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యేవర్గీయులు కూడా ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేల్చారు. దాంతో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంది.

టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై డీఎస్‌ కామెంట్స్‌

Submitted by arun on Wed, 06/27/2018 - 13:43

తనకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని డీఎస్‌ లైట్‌ తీస్కున్నారు. కేసీఆర్‌కి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. తనపై ఫిర్యాదే కదా చేస్తానంది... గొంతు కోస్తానని చెప్పలేదు కదా అంటూ కామెంట్‌ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా... ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పరిణామాలపై తానిప్పుడేమీ మాట్లాడబోనన్నారు. 

డీఎస్‌పై చర్యలు తీసుకోండి

Submitted by arun on Wed, 06/27/2018 - 12:57

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా నాయకత్వం తీర్మానం చేసింది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖరాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. మొత్తం 9 నియోజకవర్గాల్లోనూ గెలిపించి తెరాస అధికారంలోకి రావడానికి సహకరించారు.

కాంగ్రెస్‌లోకి డీఎస్‌...?

Submitted by arun on Wed, 06/27/2018 - 12:15

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా నాయకత్వం తీర్మానం చేసింది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖరాశారు.

ప్రేమపెళ్లికి బ్రేక్‌.. యువతిని ఎత్తుకెళ్లిన బంధువులు

Submitted by arun on Thu, 06/21/2018 - 10:20

ఐదే ఐదు నిమిషాలు... అంతలోనే ఆ ప్రేమికుల ఆశలు అడిఆశలయ్యాయి. పెద్దలను ఎదిరించి మరి ఆర్యసమాజ్‌లో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతే... ఇంతలోనే సమాచారం అందుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు... సినిమా సన్నివేశాలను తలపించే రేంజ్‌లో పదికి పైగా మోటార్‌ సైకిళ్లతో వాలిపోయారు. కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడిని చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.