telangana

పొత్తుల్లో భాగంగానే టికెట్ లేట్..

Submitted by chandram on Sun, 11/18/2018 - 14:28

మహా కూటమి పొత్తుల్లో భాగంగానే తనకు టికెట్ లేట్ అయిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో కాంగ్రెస్ బుజ్జగింపుల కమిటీని ఆయన కలిశారు. వీలున్నంతవరకు అందరికి కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తను 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అయినా మరీ అధిష్ఠానం ఎందుకుఅలాచేసిందో తెలియదు కాని పార్టీ కలిపితీసుకపోయే భాధ్యతను మరింత భుజనవెసుకోని గెలుపుకోసమే కృషిచేస్తనని పొన్నాల తెలిపారు.

మహాకూటమిలో మరో ట్విస్ట్

Submitted by chandram on Sun, 11/18/2018 - 13:11

మహాకూటమిలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్ధానాల్లో  స్నేహపూర్వక పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.  గ్రేటర్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో పోటీకి కాంగ్రెస్ నేతలు సిద్ధమయినట్టు సమాచారం. పార్టీ అభ్యర్ధిగా మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. బుజ్జగింపుల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో చిట్‌‌చాట్ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరపున తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ బీఫాంతోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నేడే కాంగ్రెస్ తుది జాబితా విడుదల

Submitted by chandram on Sun, 11/18/2018 - 11:55

కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితా నేడు విడుదల కానుంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 94 స్దానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్  ఇప్పటి వరకు మూడు విడతల్లో 88 మంది అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన 6 స్ధానాలను అభ్యర్ధులను నేడు ఖరారు చేయనుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని పటాన్‌చెరు, రాజేంద్ర నగర్‌, సికింద్రాబాద్‌ స్ధానాలతో పాటు  కోరుట్ల, నారాయణఖేడ్‌, నారాయణపేట్‌ స్ధానాల్లో ఆశావాహులు అధికంగా ఉండటంతో అభ్యర్ధులను ఖరారు చేయలేదు.

అసంతృప్తులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం

Submitted by arun on Sat, 11/17/2018 - 17:47

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రెబల్స్‌గా పోటీ చేయాలని భావిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు  ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కర్నాటక మంత్రి శివకుమార్, పాండిచ్చేరి సీఎం నారాయణస్వామితో పాటు మంత్రి మల్లాది కృష్ణారావులతో కమిటీని ఏర్పాటు చేశారు. అసంతృప్తులతో స్వయంగా మాట్లాడనున్న కమిటీ సభ్యులు పార్టీకి సహకరించాలని కోరనున్నారు.  రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే కమిటీ సభ్యులు బస చేయనున్నారు. జిల్లాల వారిగా అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన నేతలు కమిటీ సభ్యులకు అందజేశారు. 

కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఖుష్బూ

Submitted by arun on Sat, 11/17/2018 - 11:19

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సంచలన ఆరోపణలు చేశారు. బతకమ్మచీరల పేరుతో 222 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన  ఖుష్బూ కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతిభవన్‌లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోవట్లేదని అన్నారు. 

మహాకూటమికి గ్లామర్ బూస్ట్...ప్రచార పర్వంలోకి టాలీవుడ్ స్టార్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:55

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి సింహా దిగుతున్నాడు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో చావు లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త జోష్ ఇస్తుంది. మహాకూటమిలో కోరిన సీట్లను టీడీపీ దక్కించుకుంది. మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు. 

నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు

Submitted by arun on Fri, 11/16/2018 - 13:58

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ రజత్ కుమార్. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికార పార్టీ నాయకులపై కూడా ఫిర్యాదు వస్తే కేసులు పెడుతున్నామని తెలిపారు. పోలింగ్ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తారని తెలిపారు. సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని అన్నారు. సుందరయ్య విజ్నాన కేంద్రంలో రజత్ కుమార్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. 

19 స్థానాలపై సస్పెన్స్...వ్యూహాత్మకంగా కాంగ్రెస్ మూడో జాబితా...

Submitted by arun on Fri, 11/16/2018 - 10:58

కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. తుది జాబితా విడుదలకు అంతా సిద్ధమైందని నిన్నంతా హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు చివరికి అభ్యర్థుల పేర్లను రేపు ప్రకటిస్తామని తీరిగ్గా తెలిపారు. ఇంతకీ కాంగ్రెస్ మూడో లిస్ట్ విడుదల ఎందుకు జాప్యమౌతోంది. కోదండరాం ఢిల్లీ వెళ్ళడానికి కాంగ్రెస్ లిస్ట్ వాయిదా పడటానికి సంబంధం ఉందా..? జనగామ సీటు కోసం ఢిల్లీలో పొన్నాల సాగిస్తున్న మంతనాలు ఎంతవరకు వచ్చాయి..?

కాసేపట్లో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ విడుదల

Submitted by arun on Thu, 11/15/2018 - 10:44

తెలంగాణలో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఏఐసీసీ ఇన్‌చార్జి సెక్రటరీలు, పీసీసీ చీఫ్ భేటీ అయి జాబితాను ఖరారు చేయనున్నారు. ఇప్పటిదాకా విడుదలైన జాబితాల్లో కొందరు సీనియర్ల పేర్లు కనపించలేదు. ముఖ్యంగా జనగామ, తుంగతుర్తి, సనత్‌నగర్, ఎల్‌బి.నగర్‌లలో అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పటికే టిక్కెట్టు రాని సీనియర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణలో జోరందుకున్ననామినేషన్లు

Submitted by chandram on Wed, 11/14/2018 - 18:23

రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నామినేషన్ల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు.