karimnagar

బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా బైక్ ర్యాలీ

Submitted by chandram on Sun, 11/11/2018 - 15:13

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ నాయకులకు ప్రజాధనం దోచుకోవడం తప్ప సమస్యలను పట్టించుకునే తీరిక లేదని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. డివిజన్‌ 12 లోని పోచమ్మవాడ, షాయిత్‌ పురాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంజయ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్‌ తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. ప్రజలను మభ్య పెడుతున్న టీఆర్ఎస్‌ను ఓడించాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. 

కరీంనగర్ లో టీఆర్ఎస్, బిజెపిలకు షాక్

Submitted by arun on Wed, 10/24/2018 - 12:31

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో టీఆర్ఎస్, బిజెపి పార్టీలకు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాడిజెర్రి టీఆర్ఎస్ ఎంపీటీసీ కొత్తూరు మణెమ్మ, లక్ష్మీదేవిపల్లి బిజెపి ఎంపీటీసీ పొన్నం విజయ, నారాయణపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మల్లేశం, ర్యాలపల్లి బిజెపి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ పార్టీలకు రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ఎంపీటీసీలుగా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో కొత్త జైపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని వారు చెప్పారు. 

తెలంగాణలో మరో పరువు హత్య?

Submitted by arun on Tue, 10/09/2018 - 11:10

ప్రేమికులపై దాడులు ఆగడం లేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారిని కుటుంబ పెద్దలు వదలడం లేదు. మిర్యాలగూడు, ఎర్రగడ్డ తర్వాత కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో కుమార్‌ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్‌ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో వారి ప్రేమను అంగీకరించని అమ్మాయి తరపు బంధువులే కుమార్‌ను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

గంగుల కమలాకర్‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Sat, 10/06/2018 - 14:20

మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో ఆయన స్పీడ్‌ బోటును పరిశీలించి దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ఎల్‌ఎండీలో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. అయితే లైఫ్‌ జాకెట్‌ వేసుకోవడం.. అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది ఆయన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్‌ స్పీడ్‌ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల రగడ

Submitted by arun on Wed, 09/26/2018 - 12:55

కరీంనగర్‌లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వచ్చిన పొన్నం ప్రభాకర్‌ కోసం.. ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ.. మున్సిపల్‌ అధికారులు వాటిని తొలగించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు.. భగ్గుమన్నారు. ఎంపీ వినోద్‌ ఇంటిముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్‌ నాయకులతో పాటు.. మున్సిపల్‌ సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు తీయకుండా కేవలం తమ పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...సిబ్బంది నిర్లక్ష్యాన్ని తెగిపడ్డ చిన్నారి బొటన వేలు

Submitted by arun on Mon, 09/24/2018 - 12:12

డబ్బు పిచ్చితో  జనం మానవత్వం మరిచిపోతున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న వారు తప్పుదారి పడుతున్నారు. ఓ నర్సు నిర్లక్ష్యంగా చేసిన పని ఓ పసికందు నరకం అనుభవించాడు. పైగా అభంశుభం తెలియని చిన్నారి  ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. 

కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 11:32

కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఈ తెల్లవారు జామున 3 గంటలకు సమీపంలోని అటవీ నుంచి వచ్చిన ఎలుగుబంటి రోడ్లపై రౌండ్లు కొట్టింది. తర్వాత టవర్‌ సర్కిల్‌ లోని బీఎస్‌ఎన్‌ ఎల్‌ టవర్‌ వెనుక ఉన్న చిన్న ఆఫీస్‌లోకి వెళ్లి దాక్కుంది. దీంతో విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలుగుబంటిని పట్టుకునేందుకు నాలుగు గంటలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు వరంగల్‌ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం కరీంనగర్‌కు రప్పిస్తున్నారు. ఎలుగుబంటి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.

కరీంనగర్‌ కేసీఆర్‌కు కలిసొచ్చే జిల్లా

Submitted by arun on Thu, 09/06/2018 - 11:26

అవునన్నా... కాదన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతారు. ప్రతీ మంచి పనికి ముహుర్తం, ప్రతీ శుభకార్యానికి తారబలం చూసుకుంటారు. ఎవరేమనుకున్నా దాన్నే నమ్ముతారు. అలాగే నడుస్తారు. ఇప్పుడు హుస్నాబాద్‌ సభకు కూడా సెంటిమెంటే కీలకమైంది. 

సెంటిమెంట్ ఫాలో అవుతారు...ముహుర్తాన్ని చూసుకుంటారు...ముందస్తు ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎన్నికయ్యే దాకా ఇదే సెంటిమెంట్ను నమ్ముకున్నారాయన. అందులో భాగంగానే హుస్నాబాద్‌లో ప్రజాశీర్వాద సభ అంటూ ఇప్పుడూ అదే బాటలో నడుస్తున్నారు కేసీఆర్‌.

నిజామాబాద్ మీదుగా కాచిగూడ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

Submitted by arun on Fri, 06/15/2018 - 17:11

తెలంగాణలో రూ.258 కోట్ల ఖర్చుతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారు. 45 వేల కోట్లతో రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను పియూష్‌ గోయల్‌ ప్రారంభించారు. కరీంనగర్‌ వరకు పొడిగించిన కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజర్ రైలును వారు జెండా ఊపి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నాల్గవ పాదచారుల వంతెన నిర్మాణానికి పియూష్‌ గోయల్ శంకుస్థాపన చేశారు. అన్ని రైల్వే స్టేషన్లు, పరిపాలన భవనాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను ప్రారంభించారు.

కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Submitted by arun on Fri, 06/15/2018 - 12:24

కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులుగా రసజ్ఞ అతడికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది.