CM Chandrababu

అలా చేస్తే చంద్రబాబుకు ఘన సన్మానం చేస్తాం: ముద్రగడ

Submitted by arun on Tue, 09/04/2018 - 15:20

కాపులను బీసీల్లో చేర్చుతామనే హామీతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికంటే ముందే కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే... లక్ష మందితో చంద్రబాబుకు ఘన సన్మానం చేస్తామని చెప్పారు.

ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: చంద్రబాబు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:32

ఆంధ్రప్రదేశ్‌లో మరో అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి పునాది రాయి పడింది. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రం నుంచి  క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడతమన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో టీటీడీకి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని టాటా ట్రస్ట్‌ నిర్మిస్తోంది.

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే మా లక్ష్యం

Submitted by arun on Fri, 08/31/2018 - 13:06

రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాల ఆయన చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు రచిస్తామన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే విస్త్రత స్ధాయిలో దీనిపై చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. 

హెక్టార్ కు రూ.25 వేలు నష్టపరిహారం అందిస్తాం

Submitted by arun on Thu, 08/23/2018 - 11:05

ఏపీలో 2006 తర్వాత ఇప్పుడు పెద్ద వరదలు వచ్చాయని, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ వ్యూ చేసి, జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. 

ఉభయగోదావరి జిల్లాల్లో  600 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామని, హెక్టార్ కు  25 వేలు నష్టపరిహారంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

పొత్తులు ఉంటాయ్‌...టీడీపీ లీడర్లు వదులుతున్న లీకులు...

Submitted by arun on Wed, 08/22/2018 - 10:30

టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య వైరం చెరిగిపోనుందా? వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయనున్నాయా? తెలుగుదేశం లీడర్లు వదులుతున్న లీకులు దేనికి సంకేతం? కాంగ్రెస్‌పై గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదని చంద్రబాబు ఎందుకన్నట్లు?. కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో సోనియా, రాహుల్‌తో వేదికను పంచుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌‌కు దగ్గరయ్యారా? దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఎలా ఉండబోతోంది?

జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

Submitted by arun on Wed, 08/15/2018 - 10:35

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

చిన్న మెదడు చిట్లింది

Submitted by arun on Thu, 08/02/2018 - 12:57

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పోరాటం కారణంగానే చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించిన రోజా ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీకుదిర్చానని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే తెలిపారన్నారు. 2 ఎకరాల ఆసామి రూ. 250 కోట్లతో ఇళ్లు ఎలా కట్టారు? దేశంలోనే అత్యంత ధనవుంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా మారారు? అని ప్రశ్నించారు.

తోక ముడిచిన జగన్‌ : సీఎం చంద్రబాబు

Submitted by arun on Thu, 08/02/2018 - 10:46

యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్, అందరూ వ్యతిరేకించడంతో తోకముడిచారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని పేరూరు ప్రాజెక్ట్‌ నీటిని కాల్వకు భూమిపూజ చేసిన సీఎం ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడుతున్నామని తెలిపారు. ధర్మం మనవైపు ఉంది కనుకే ధర్మపోరాట దీక్షకు దిగామని, ఏదైనా విషయంపై పోరాడాల్సి వస్తే తన తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. 

సీఎంతో మాట్లాడా.. అంతా సమసిపోయింది: జేసీ

Submitted by arun on Mon, 07/23/2018 - 16:13

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 20నిమిషాల పాటు సాగింది. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అవిశ్వాసానికి గైర్హాజరు రాజీనామా వంటి ప్రకటనలపై చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. అయితే ఇలాంటి ప్రకటనలు ఇకపై చేయవద్దంటూ జేసీకి చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం.

చంద్రబాబుకు రెండు ప్రశ్నలను సంధించిన విజయసాయిరెడ్డి

Submitted by arun on Mon, 07/23/2018 - 12:56

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దంటూ కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో చేసిన ధన్యవాద తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని కూడా విత్‌ డ్రా చేసుకున్నారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇవేమీ ఉపసంహరించుకోకుండా  కేంద్రంపై పోరాటమంటూ డ్రామాలు ఆడుతున్నారా? అంటూ విరుచుకుపడ్డారు.