Pre Release Event

నా 27 సినిమాల్లో ఎన్నడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు: కన్నీటితో ఎన్టీఆర్

Submitted by arun on Wed, 10/03/2018 - 11:44

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి నటీనటులతోపాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు . త్రివిక్రమ్‌తో ఫిల్మ్ చేయాలన్నది 12 ఏళ్ల తన కల అని చెప్పుకొచ్చాడు."ఇది నా 28వ చిత్రం. గత 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలను ఏ దర్శకుడూ నాకు ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో యాధృచ్చికమో ఏమో... మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి" అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడాడు. నెల కిందట తన జీవితంలో జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమోనని అన్నాడు.

అజ్ఞాతవాసి కూడా చూడండి : సూర్య

Submitted by arun on Sat, 01/06/2018 - 12:27

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. ‘‘2018లో అందరి కలలు సాకారం కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ‘గ్యాంగ్‌’ అనేది చాలా ముఖ్యమైంది. మన అందరికీ స్కూల్‌, కాలేజ్‌, పనిచేసే చోట గ్యాంగ్‌ కచ్చితంగా ఉంటుంది.

అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.