Prime Minister Narendra Modi

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు

Submitted by arun on Fri, 06/08/2018 - 18:35

ప్రధాని మోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందా ? భీమా-కొరెగావ్‌ కేసులో...పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు సమర్పించిన లేఖలో ఏముంది. రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్‌ వేశారా ? మోడీ హత్యతో విరసం నేత వరవరరావుకు లింకేంటీ ? మోడీ ప్రభ తగ్గిపోయినప్పుడల్లా....కొత్త కథలు అల్లుతారంటున్న కాంగ్రెస్‌ వ్యాఖ్యల్లో నిజమెంత ?

కుమారస్వామి సంచలన నిర్ణయం... మోదీ బాటలో...!

Submitted by arun on Sat, 06/02/2018 - 11:34

అధికారిక సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరూ ఫోన్లను వినియోగించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. మీటింగ్ లు జరుగున్నప్పుడు కొందరు అధికారులు ఫోన్లను చూస్తున్నారని... దీనివల్ల చర్చలకు ఇబ్బంది కలుగుతోందని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు ఫోన్లను తీసుకురాకూడదని తెలిపారు. సమావేశం ముగిసేంత వరకు ఫోన్లను కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. తన సమావేశాలకు అధికారులెవరూ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు.

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ

Submitted by arun on Mon, 02/19/2018 - 12:33

భారతదేశాన్ని డిజిటలైజ్ చేసే దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోడీ అనంతరం ప్రసంగించారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోడీ చెప్పారు. తమ ప్రయత్నాల్లో ప్రజలూ భాగస్వామ్యం అయితే వేగవంతమైన ఫలితాలు వస్తాయన్నారు. 

పీఎం మోడీ దావోస్ ప్ర‌సంగంపై ట్విట్ట‌ర్ రివ్యూ

Submitted by arun on Tue, 01/23/2018 - 19:46

స్విర్జ‌ర్లాండ్ దావోస్ లో వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరం 48వ వార్షికోత్స‌వ స‌మావేశం జ‌రిగింది. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ తర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత ప్రధాని మోడీ తొలిసారి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా  వరల్డ్ ఎకాన‌మిక్ ఫోరంను స్థాపించిన ష్వాబ్‌ను ప్రశంసించారు. ష్వాబ్ ఆర్థిక, రాజకీయ రంగాలను గట్టిగా ముడివేశారన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్న మోడీ..

20 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆర్థిక వేదికపై భారత ప్రధాని ప్రసంగం

Submitted by arun on Tue, 01/23/2018 - 18:44

ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశలో పయనించేలా.. ప్రపంచ ఆర్థిక సదస్సు దోహదపడుతుందన్నారు ప్రధాని మోడీ. 20 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయిందన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇండియాలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు పెరిగాయన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో.. ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ తర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత ప్రధాని తొలిసారి ప్రసంగించారు. టెక్నాలజీ అభివృద్ధితో.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు మోడీ.

ప్రధాని మోడీని కలిసిన విరుష్క జంట

Submitted by arun on Thu, 12/21/2017 - 11:13

విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విరుష్క జోడీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ-అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.