DMK

సంచలన నిర్ణయం తీసుకున్న ‘అళగిరి’

Submitted by arun on Mon, 08/20/2018 - 15:20

కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తన బలాన్ని నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆయన లక్ష మంది మద్దతుదారులతో చెన్నై నగరంలో బలప్రదర్శనకు దిగనున్నారు. వచ్చే నెల 5న చెన్నైలో శాంతిప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో డీఎంకేలో ముసలం ఏర్పడింది. ముఖ్యంగా కరుణానిధి కుమారులైన అళగిరి, ఎంకే స్టాలిన్‌ల మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయ్. ఇటీవల మెరీనా తీరంలోని కరుణానిధి సమాధికి అంజలి ఘటించిన తర్వాత అళగిరి తన కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇటీవల డీఎంకే కార్యవర్గ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు.

అన్నదమ్ముల సవాల్...ఎన్నికల తర్వాత పార్టీ ఉండదు

Submitted by arun on Tue, 08/14/2018 - 11:50

డిఎంకేలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందా? ఏ క్షణమైనా అది భగ్గుమంటుందా? కరుణానిధి శకం ముగిశాక డిఎంకే పతనం మొదలైందా? అన్నదమ్ములిద్దరూ చెరో వైపు తండ్రి చరిష్మానీ, పార్టీని లాగితే, డిఎంకే భవిష్యత్తు ఏమవుతుంది? డిఎంకేలో విభేదాలు బిజెపికి వరంగా మారతాయా?

చివరిసారిగా అప్పా అని పిలవనా..?

Submitted by arun on Wed, 08/08/2018 - 14:30

తండ్రి మరణం.. ఏ కుమారుడికైనా తీరని లోటే. చిన్నప్పటి నుంచి అన్నీ తానై పెంచిన నాన్న తనతోడు లేడని తెలిస్తే ఆ తనయుడికి ఒంటరిననే భావన వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్. అలాంటి సందర్భంలో తన తండ్రి గురించి స్టాలిన్‌ చివరిసారిగా రాసిన కవిత తండ్రి కరుణానిధిపై ఆయనకున్న వాత్సల్యాన్ని తెలియజేస్తుంది. 

కరుణానిధి కళ్లజోడు కథ ఇదీ!

Submitted by arun on Wed, 08/08/2018 - 10:04

కరుణానిధి అనగానే కళ్లకు నల్ల కళ్లద్దాలు, ఒంటిపై పసుప పచ్చని శాలువ ధరించిన నిలువెత్తు రూపం చప్పున స్ఫురిస్తుంది. ఈ రెండూ లేకుండా ఆయన కనిపించడం అరుదనే చెప్పుకోవాలి. శాలువ సంగతి పక్కనపెడితే, నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరిస్తారనే విషయం చాలామందికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. అరవైయేళ్ల క్రితం కరుణానిధి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో 1952లో తిరుప్పత్తూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి కంటికి తీవ్ర గాయాలయ్యాయి.

హెల్త్ బులిటెన్‌లో విషాద వార్త...కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తేల్చి చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం

Submitted by arun on Tue, 08/07/2018 - 17:10

కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించింది.  అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమంటూ వైద్యులు ప్రకటించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కార్యకర్తల రోదనలతో కావేరీ ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ఆస్పత్రి వద్ద పోలీసులతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే, రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ కూడా సెలవుల్లో ఉన్న పోలీసులంతా తక్షణమే విధులకు హాజరుకావాలని సర్క్యులర్ జారీ చేశారు.
 

కరుణానిధి ఆరోగ్యం

Submitted by arun on Sat, 07/28/2018 - 10:16

కరుణానిధి యొక్క ఆరోగ్య పరిస్థితి,

ఇప్పుడు చేరుకుంటుంది విషమస్థితి,

ఆందోళనలో అభిమానుల మనోస్థితి,

ఎమవుతుందో తెలియని ప్రస్తుతస్థితి. శ్రీ.కో

మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం...హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Submitted by arun on Sat, 07/28/2018 - 06:53

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. విషయం తెలుసుకున్న వెంటనే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో కరుణానిధికి ఎనిమిది మంది వైద్యుల బృందం ప్రత్యేక చికిత్సనందించింది. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు కరుణానిధి బీపీ లెవల్స్ తగ్గినట్టు తెలియజేశారు.

రాజ‌కీయాల్లోకి మ‌రోస్టార్ హీరో

Submitted by lakshman on Tue, 01/23/2018 - 08:38

దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తండ్రి రాజ‌కీయాల్లో క్రీయాశీల‌క పాత్ర‌పోషిస్తే ..కొడుకు కూడా తండ్రి వార‌స‌త్వంగా వ‌స్తున్న రాజ‌కీయాన్నే శాసించాలి. ప్ర‌స్తుతం మ‌న‌దేశం లో జ‌రుగుతున్న రాజ‌కీయా తంతు ఇదే. ఇదిలా ఉంచితే తమిళరాజకీయాల్లో కురువృద్దుడు డీఎంకే అధినేత కరుణానిధి చెరగని ముద్ర వేశారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు  దాదాపు 60 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ప్రయాణించారు కరుణానిధి. అలాంటి కరుడుగట్టిన రాజకీయ నేత అయిన కరుణానిధి ప్ర‌స్తుతం వార‌స‌త్వ రాజ‌కీయాల్నీ ప్రోత్స‌హించే ప‌నిలో బిజీగా ఉన్నారు. 

తమిళ నాట ఏం జరుగుతోంది.. కరుణానిధిని మోడీ అందుకే కలిశారా?

Submitted by arun on Tue, 12/26/2017 - 12:04

తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయా?.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం ఆ రాష్ట్ర రాజకీయాలనే మార్చేయబోతోందా? పళని,పన్నీర్ తో దినకరన్ ఢీకొడుతుంటే ఉనికి కోసం ప్రయత్నిస్తున్న కమలం డిఎంకె నీడన చేరుతుందా? వాట్ నెక్స్ట్? 

తమిళనాట కాలు మోపాలని తహతహలాడుతున్న బీజేపీకి ఆర్కే నగర్ బై పోల్స్  పెద్ద షాకిచ్చాయి దక్షిణాదిన విరబూయాలని  ఆశపడుతున్న కమలానికి అదంత ఈజీ కాదని తేల్చేశారు నల్లతంబిలు..మరిప్పుడు బీజేపీకి ఏం చేస్తుంది?

ఆసక్తి రేపుతున్న ఆర్కేనగర్‌ ఉప పోరు

Submitted by arun on Thu, 12/21/2017 - 10:36

తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌లో 256 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ. మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌లు ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మరుదుగణేశ్‌, దినకరన్‌, మధుసూదన్‌ల మధ్యనే ఉంటుందని అంచనా.