Bhaagamathie

భాగమతికి ఫస్ట్ వీక్ కలెక్షన్

Submitted by lakshman on Sat, 02/03/2018 - 12:56

టాలీవుడ్ లో 2018 మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ను మొదట అనుష్క అందుకుందనే చెప్పాలి. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు భాగమతి సంతృప్తి పరచిందనేది ప్రస్తుతం టాలీవుడ్ నడుస్తున్న హాట్ టాపిక్. అంతే కాకుండా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు సినిమా మంచి లాభాలను అందించింది బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంప‌ర కొన‌సాగుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో అనుష్క నటన బాగా క్లిక్ అయ్యింది. అందుకు తగ్గట్టు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కూడా హర్రర్ స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు

Submitted by arun on Fri, 02/02/2018 - 10:25

టాలీవుడ్ లో 2018 మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ను మొదట అనుష్క అందుకుందనే చెప్పాలి. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు భాగమతి సంతృప్తి పరచిందనేది ప్రస్తుతం టాలీవుడ్ నడుస్తున్న హాట్ టాపిక్. అంతే కాకుండా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు సినిమా మంచి లాభాలను అందించింది. ముఖ్యంగా సినిమాలో అనుష్క నటన బాగా క్లిక్ అయ్యింది. అందుకు తగ్గట్టు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కూడా హర్రర్ స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

ఎక్క‌డ చూసినా భాగ‌మ‌తి అరుపులే

Submitted by lakshman on Fri, 02/02/2018 - 01:22

హిందీలో ప‌ద్మావ‌త్ , తెలుగులో భాగ‌మ‌తి. ఈ రెండు సినిమాలో హీరోయిన్ లీడ్ రోల్ గా తెర‌కెక్క‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయ‌నే చెప్పుకోవాలి. బాహుబ‌లి గ్యాప్ లో సైజ్ జీరోలో భారీగా బ‌రువు పెరిగిన అనుష్క‌ అంద‌ర్ని ఆశ్చ‌ర్యంలో ముచ్చెంత్తింది. సైజ్ జీరో తరువాత బాహుబ‌లి-2 కోసం య‌ధావిధిగా వ‌చ్చేందుకు బాగానే క‌ష్ట‌ప‌డింది. ఆమె క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా ఆ సినిమా ఎంత బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయ్యిందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే తాజాగా అనుష్క అశోక్ కుమార్ డైర‌క్ష‌న్ లో విడుద‌లైన భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. 

దుమ్ము రేపుతున్న భాగమతి.. 50 కోట్ల క్లబ్‌లో అనుష్క

Submitted by arun on Thu, 02/01/2018 - 11:47

బాహుబలి తర్వాత అనుష్క శెట్టి నటించిన భాగమతి చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. యూవీ క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం అందరి అంచనాల తలకిందులు చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. మంగళవారం జరిగిన భాగమతి థ్యాంక్యూ మీట్‌లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్ దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అనుష్క‌కు దూరంగా రెబల్ స్టార్

Submitted by lakshman on Wed, 01/31/2018 - 06:51

అస‌లే హిట్ పెయిర్ అయిన  ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు.

స్టార్ హీరోల‌కు అనుష్క స‌వాల్

Submitted by lakshman on Sun, 01/28/2018 - 09:39

స్టార్ హీరోల‌కు భాగ‌మ‌తి స‌వాల్ విసురుతోంది. పండ‌గ సీజ‌న్ లో పెద్ద సినిమాలు బోల్తాప‌డ్డాయి. అనుకున్నంతగా ఆక‌ట్టుకోలేక వారంరోజులకే చాప‌చుట్టేశాయి. కానీ అనుష్క మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్ హీరోల‌కు స‌వాల్ విసురుతోంది. స్టార్ హీరో ఉంటే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టొచ్చు అనే సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టిన ఈబెంగ‌ళూరు బ్యూటీ భాగ‌మ‌తితో అద‌ర‌గొడుతుంది. సినిమా విడుద‌ల‌తో స్టార్ హీరోల‌కే బ‌య‌ప‌డే బ‌య‌ర్లు అనుష్కాను న‌మ్మి కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాను విడుద‌ల చేశారు.  ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్మ చేయ‌కుండా  బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

‘భాగమతి’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 01/26/2018 - 12:37

టైటిల్ : భాగమతి
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ
సంగీతం : తమన్‌.ఎస్‌
దర్శకత్వం : జి. అశోక్‌
నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌

భాగమతిలో బాహుబలి ట్విస్ట్ !

Submitted by arun on Thu, 01/25/2018 - 17:09

రేపు విడుదలకాబోతున్న ‘భాగమతి’ రిజల్ట్  కోసం అనుష్క ఫాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈసంక్రాంతికి విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ  ఘోర పరాజయం చెందడంతో  ఈ ఏడాది మొట్టమొదటి సూపర్ హిట్ మూవీగా ‘భాగమతి’  మారబోతోంది అన్న అంచనాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘అరుంధతి’ తరహాలో అవుట్ అండ్ అవుట్ హారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశోక్ దీన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది అని ఈ సినిమా ఫైనల్ కాపీ చుసిన వారు చెపుతున్నారు.

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేను: అనుష్క

Submitted by arun on Thu, 01/18/2018 - 12:46

గత కొంతకాలంగా ప్రభాస్ కు, అనుష్కకూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలను ఇద్దరూ ఖండించినప్పటికీ, రూమర్స్ మాత్రం ఆగలేదన్న సంగతి తెలిసిందే. అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. ఈ చిత్ర తమిళ ఆడియో వేడుక బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అనుష్క ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యకాలంలో అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను. నాకోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి.

అందులో స్వీటీ ముందుంటుంది: ప్రభాస్

Submitted by arun on Wed, 12/20/2017 - 15:35

అనుష్క (స్వీటీ) నటించిన 'భాగమతి' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. థ్రిల్లింగ్ విజువల్స్ తో రూపొందించిన భాగమతి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినీ ప్రముఖులు అనుష్క పాత్రల ఎంపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. అనుష్కపై ప్రశంసలు కురిపించాడు. "ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే ఉంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతోపాటు 'భాగమతి' టీజర్ ను కూడా అప్ లోడ్ చేశాడు.