mla roja

చిన్న మెదడు చిట్లింది

Submitted by arun on Thu, 08/02/2018 - 12:57

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పోరాటం కారణంగానే చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించిన రోజా ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీకుదిర్చానని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే తెలిపారన్నారు. 2 ఎకరాల ఆసామి రూ. 250 కోట్లతో ఇళ్లు ఎలా కట్టారు? దేశంలోనే అత్యంత ధనవుంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా మారారు? అని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన.. త్వరలో...

Submitted by arun on Tue, 07/24/2018 - 15:28

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే 'వైయస్సార్ అన్న' పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే, ప్రజల కోసం తానే సొంతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని చెప్పారు. 10మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు ఇచ్చామని, నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్‌ కాలేజీలో ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎమ్మెల్యే రోజా అరెస్ట్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

Submitted by arun on Tue, 07/24/2018 - 10:33

ఏపీకి ప్రత్యేక హోదా కోసం... వైసీపీ బందులో ఆ పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే రోజాను ముందస్తు అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు పోలీస్‌‌లు రోజాను స్టేషన్‌కి తరలించారు. అరెస్ట్‌ సందర్భంగా కొద్దిసేపు కార్యకర్తలు స్టేషన్‌ ముందు ధర్నా చేపట్టారు. అయితే 144 సెక్షన్‌లో భాగంగా కార్యకర్తలని పోలీసులు చెదరగొట్టారు. అంతకన్నా ముందు నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని కూడా అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 07/16/2018 - 10:27

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాసంప్రోక్షణ  పేరుతో తిరుమల ఆలయాన్ని తొమ్మిది రోజులు పాటు మూసివేయడంపై పలు అనుమానాలకు  తావిస్తోందని ఆరోపించారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించకపోవడం దారుణమన్నారు.  వెంకన్నను దర్శించుకోవడం కుదరదు కొండకు రావొద్దని టీటీడీ చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.  టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

ఆయన రాకతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి: రోజా

Submitted by arun on Wed, 07/11/2018 - 14:45

పోలవరం పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి గడ్కరీ వస్తున్నారనగానే.. చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఏ కేంద్రమంత్రి వచ్చినా పట్టించుకోని బాబు.. గడ్కరీ వస్తున్నారన్నగానే.. కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులెవరినీ వెళ్లొద్దని చెప్పి తానే ముందు వెళ్లారన్నారు. దీనిని బట్టే పోలవరం పనుల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు రోజా. చిత్తూరు జిల్లా ఎస్వీపురంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆర్కే రోజా ట్రస్టు ద్వారా సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు.

జనసేన పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

Submitted by arun on Mon, 06/18/2018 - 14:25

వైసీపీ ఎమ్మెల్యే రోజా సోమవారం శ్రీకాళహస్తి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయపండితులు వారికి దర్శన ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీని నిలదీస్తానని ఘీంకరిస్తూ ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయనకు వంగి వంగి సలాములు చేశారని విమర్శించారు. ఆయన ఓ అవకాశవాది అని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే వ్యక్తిఅని ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో ఓ పక్క భయం, మరో పిచ్చినవ్వు కన్పించిందని ఎద్దేవా చేశారు.

వైఎస్ కు చంద్ర‌బాబుకు మ‌ధ్యఉన్న తేడా అదేనా

Submitted by lakshman on Thu, 04/12/2018 - 11:53

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే ..తాము బీజేపీ తో కుమ్మ‌క్క‌య్యామ‌ని అన‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. బీజేపీ కుమ్మక్కైతే హ‌స్తిన‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేయాల్సిన అవస‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రం అంతా వైసీపీ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు ఆనంద న‌గ‌రాల పేరుతో వేడుక‌లు జ‌ర‌ప‌డం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. ఇలాంటి ప‌నికిమాలిన కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హాజ‌ర‌వ్వ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. 

పవన్‌పై ఎమ్మెల్యే రోజా కామెంట్స్

Submitted by arun on Mon, 02/19/2018 - 11:17

పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్దంగా ఉందని టీడీపీ, కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగట్టే సత్తా పవన్ కల్యాణ్ కుందా అని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరింది. ఇవాళ తిరుమలకు వచ్చిన ఆమె.. వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకుంది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జేఎఫ్ సీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 

ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ

Submitted by arun on Mon, 01/22/2018 - 13:55

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బీరువాలో పెట్టిన విలువైన హారం ఎలా అపహరణకు గురైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. పనివాళ్లే ఎవరైనా తీశారా? లేక బయటివాళ్లు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారా?

రోజా చెవిలో పూలు..

Submitted by arun on Wed, 01/10/2018 - 16:00

యువతకు రెండు చెవుల్లో పూలు పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని దగా చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీలో రోజా పాల్గొన్నారు. ఆందోళనకారులు, రోజా చెవుల్లో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహనికి కు పూలమాల వేసి కరపత్రం అందజేశారు. టీడీపీ పాలనకు బుద్ధి చెప్పేందుకు యువత కదలిరావాలని రోజా పిలుపునిచ్చారు.