Amith Shah

బీజేపీని వణికిస్తున్న కొత్త భవనం...బీజేపీకి టీడీపీ దూరం కావడానికి...

Submitted by arun on Mon, 10/22/2018 - 11:45

కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమేంటి..? కర్ణాటకలో కమలనాథుల పరాజయానికి కారణమేంటి..? బీజేపీకి టీడీపీ దూరం కావడానికి..జమ్ములో పీడీపీతో సంకీర్ణం విచ్ఛిన్నం కావడానికి కారణమెవరు..? శివసేన - బీజేపీ శత్రువులు అవ్వడం వెనుకున్న రీజన్ ఏంటి..? కమలదళం మదిలో మెదులుతున్న సెంటిమెంట్ వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే..! 
 

ఓటమి భయంతోనే ముందస్తు- అమిత్‌షా

Submitted by santosh on Wed, 10/10/2018 - 17:29

మోడీ హవాలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్ తహతహలాడుతున్నారని విమర్శించారు.  ఆయన ఆశలు నెరవేరవన్నారు అమిత్ షా. బీసీలకు ఇబ్బందిగా మారే ముస్లింల 12 శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు. 
 

బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివదేహం...

Submitted by arun on Fri, 08/17/2018 - 11:38

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహనికి పార్టీ అగ్రనేతలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు నివాళులర్పించారు. అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

మెట్టు దిగిన మోడీ-అమిత్ షా: అద్వానీ-మురళీ మనోహర్ జోషిలకు బుజ్జగింపు

Submitted by arun on Wed, 06/06/2018 - 17:28

తాజా ఉప ఎన్నికల ఫలితాలతో మోదీ ,అమిత్‌ షాలకు తత్వం బోధపడిందా ?  2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాలుగు అడుగులు వెనక్కు వేయక తప్పదని భావిస్తున్నారా ? దూరమవుతున్న మిత్రులను కలుపు కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా ?  ఇందుకోసం వృద్థతరం నేతలను  తెర మీదకు తెచ్చేందుకు అధినేత  అమిత్‌ షా స్వయంగా రంగంలోకి దిగారా ? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు కమలనాథుల నుంచి అవుననే సమాధానాలు  వినిపిస్తున్నాయి. 

అమిత్‌షాకి ఊహించని షాక్

Submitted by arun on Wed, 06/06/2018 - 15:53

బీజేపీ చీఫ్ అమిత్‌షాకి మిత్రపక్షం శివసేన ఊహించని షాక్ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ఈ రోజు సాయంత్రం కలుసుకోనుండగా, శివసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ... ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది.

మహానాడులో అమిత్‌షాకు చంద్రబాబు కౌంటర్

Submitted by arun on Mon, 05/28/2018 - 13:26

నమ్మకం ద్రోహం చేసిన పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరముందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణానికి కేవలం 15వందల కోట్లు మాత్రమే ఇచ్చారన్న చంద్రబాబు....అందుకు సంబంధించిన 15వందల 9 కోట్ల బిల్లుల పంపామన్నారు.  నిజమైన యూసీలు పంపలేదన్న బీజేపీ నేతలకు.... స్వీయ ధృవపత్రాలేమీ పంపలేదని అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కన్న చంద్రబాబు...ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 
 

సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజం

Submitted by arun on Mon, 05/28/2018 - 12:02

టీడీపీ,బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకూ రూపాయి ఖర్చుపెట్టలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. ఇప్పటికే 2,100 కోట్లు ఇచ్చామని, ఇచ్చినవాటికే లెక్కలు లేనప్పుడు కొత్తగా నిధులెలా ఇస్తామని ప్రశ్నించారు. తెలుగేతర రాష్ట్రాల్లో కేసీఆర్, చంద్రబాబుల ప్రభావం అంతగా ఉండదని అమిత్ షా తేల్చి చెప్పారు. 

సోము వీర్రాజుకు అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌

Submitted by arun on Thu, 02/08/2018 - 10:46

బీజేపీ నేత సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చీవాట్లు పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై భాజపా అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్షంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం నీకెవరు ఇచ్చారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిలదీశారు. మిత్రధర్మం, పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలకు వెనుకాడబోమని అన్నట్లు సమాచారం.

అమిత్‌షాకి షాకిచ్చిన మంచు లక్ష్మీ

Submitted by arun on Tue, 12/19/2017 - 15:56

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గుజ‌రాత్ అసెంబ్లీ సీట్లు భారీగా త‌గ్గిపోవ‌డంతో ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు న‌రేంద్ర‌మోదీ కాస్త ఇబ్బంది ప‌డుతున్నారు. వ‌రుసగా ఆరోసారి గుజ‌రాత్‌లో విజ‌య‌ఢంకా మోగించిన‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య త‌గ్గ‌డం వారికి మింగుడుప‌డ‌డం లేదు. గుజ‌రాత్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకున్న విష‌యం తెలిసిందే.