Chief Minister

మహేశ్‌ బాబుని కలసిన సీఎం

Submitted by arun on Mon, 06/18/2018 - 16:33

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కలిశారు. మహేశ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్‌ కోసం డెహ్రాడూన్‌ వెళ్లారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్‌ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్‌ అనే నేను చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన  సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (సోమ‌వారం) మొద‌లైంది.

రాజస్తాన్ మంత్రి ఏం చేశాడో చూడండి

Submitted by arun on Thu, 02/15/2018 - 15:25

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరో మచ్చ. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీచరణ్ సరఫ్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద బహిరంగంగా మంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనను మంత్రి కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయంకాదన్నారాయన. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. ఇదేమీ పెద్ద విషయం కాదని, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

అల్పాహారం కోసం ఆ సీఎం చేసిన ఖర్చు అక్షరాలా అరకోటి...!

Submitted by arun on Tue, 02/06/2018 - 15:32

పదవిలోకి వచ్చి సంవత్సరం కూడా దాటకుండానే ఉత్తరాఖండ్ సీఎం ఫలహారాల ఖర్చు అరకోటి దాటిపోయింది. చిరుతిళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన పెట్టిన ఖర్చు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. గతేడాది మార్చి 18న ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన ప్రతి అతిథికి మర్యాద చేయడం ఈ సీఎంకు అలవాటు. తమ పనులు, అవసరాల కోసం వచ్చే ప్రతి వ్యక్తికి.. కాస్త వారి ఆకలిని తీర్చే మనసున్న మనిషి ఈ సీఎం. 

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా జైరామ్ ఠాకూర్‌ ప్రమాణస్వీకారం

Submitted by arun on Wed, 12/27/2017 - 12:27


హిమాచల్ ప్రదేశ్‌ సీఎంగా జైరాం ఠాకూర్‌...ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరయ్యారు. కేంద్ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. 

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రూపానీ

Submitted by arun on Tue, 12/26/2017 - 12:18

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్‌ నేత అద్వానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్‌, మనోహర్‌ పరీకర్, మనోహర్‌లాల్ ఖట్టర్, శర్బానంద్‌ సోనోవాల్, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రూపానీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

గుజరాత్ సీఎం రేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ?

Submitted by arun on Tue, 12/19/2017 - 11:55

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం మళ్లీ ఆలోచనలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా.. అతడిని రెండోసారి కంటిన్యూ చేసేందుకు బీజేపీ పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. అందుకే అతడి స్థానంలో మంచి జనాధరణ పొందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.