janasena

జనసేన తీర్థంపుచ్చుకున్న కాంగ్రెస్ నేత..

Submitted by chandram on Sat, 11/10/2018 - 16:28

ఎట్టకేలకు జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమ‍క్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బాలరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జనసేనని పవన్ తెలిపారు. తనదీ, నాదేండ్ల మనోహర్‌ది, బాలరాజుది ఒకటే భావస్వారూప్యతని పవన్ వ్యక్యనించారు. గిరిజనుల అభివృద్ధి కోసం బాలారాజు సేవలను, అనుభవాన్ని పార్టీలో వినియోగించుకుంటామని జనసేనాని వెల్లడించారు.
 

తెలంగాణలో జనసేన పోటీపై త్వరలో నిర్ణయం: పవన్

Submitted by chandram on Sat, 11/10/2018 - 15:05

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన సన్నద్ధమౌతుంది. ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండుమూడ్రోజుల్లో స్ఫష్టత ఇస్తనని తెలిపారు. ముందుస్తు ఎన్నికలు, సన్నద్ధత లేకనే పోటీపై సమాలోచనలు జరుపుతున్నట్లు పవన్ వెల్లడించారు. అయితే ముందస్తు ఎన్నికల రాకుంటే వచ్చే ఏడాది ఎన్నికల్లో 23 అసెంబ్లీ,మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి జనసేన భావించిందని పవన్ వ్యక్యనించారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో పోటీకి పార్టీ తీవ్రసందిగ్ధత ఉందని పవన్ వెల్లడించారు.

బ్యారేజ్‌లపై కాదు.. హైవేలపై కవాతు చేసుకోండి..

Submitted by arun on Tue, 10/16/2018 - 17:16

సాగు, తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను జాతీయ రహదారులపై పెట్టుకుంటే మంచిదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్న పార్టీలు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచి 27వేల కోట్లకు పైగా పరిహారం రావాల్సి ఉందని కేంద్రం ఆ సొమ్మును విడుదల చేస్తే తాము నిర్వాసితులకు ఇచ్చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు.

పవన్‌ వైపు పలువురు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నేతల చూపు...అధికార టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు...

Submitted by arun on Tue, 10/16/2018 - 10:03

ప్రజా పోరాట యాత్రతో జోరు పెంచిన జనసేనాని పవన్ కల్యాణ్‌ మరోపక్క పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు‌. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం క్లీన్ ఇమేజ్‌ ఉన్న సీనియర్లను పార్టీలోకి తీసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కీలక నేతల వలసలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ త్వరలోనే మరికొందర్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జన సైనికుల జాడేది? సమర సన్నాహాలా? సైలెంట్ వ్యూహాలా?

Submitted by santosh on Sat, 10/13/2018 - 15:51

తెలంగాణ సమరంలో తలపడతామన్నాడు. జనసైనికులు యుద్దానికి సిద్దంగా ఉన్నారన్నాడు. తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేసి, ఇక కాస్కోండని తొడగొట్టాడు. మరిప్పుడు ఆయన సైలైంటయ్యాడు. ఎన్నికల కురుక్షేత్రంలో అన్ని పార్టీలూ, అస్త్రశస్త్రాలు దూస్తుంటే, ఏపీ గట్టుమీద నిలబడి, నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ముందస్తు వస్తుందని ముందే ఊహించలేదన్న జనసేనాని, ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామంటున్నాడు. అయితే అభ్యర్థులకు మద్దతివ్వడమో, లేదంటే ఏదో ఒక పార్టీకి సపోర్ట్‌ ఇవ్వడమో, ఏదీ లేదంటూ ఎన్నికలకు దూరంగా ఉండటమో చేస్తామంటున్నాడు. 

పవన్‌కు చింతమనేని సవాల్...నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మూడు రోజులు అన్నం తినలేవు

Submitted by arun on Thu, 09/27/2018 - 13:49

జనసేనాని పవన్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాజ్యాంగేతర శక్తిగా మారారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చేస్తున్న ఆరోపణలపై చింతమనేని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ స్థాయిని దిగజార్చుకుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చూసిన తర్వాత పవన్‌ మాట్లాడాలని అన్నారు. తనపై 37 కేసులున్నాయని పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు.

జనసేనలోకి 20 మంది ఎమ్మెల్యేలు!

Submitted by arun on Sat, 08/25/2018 - 07:35

‘ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే వారంతా పవన్‌ కల్యాణ్‌తో చర్చించారు. ఆయన నిర్ణయం తీసుకున్నాక తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’ అని జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి వెల్లడించారు. నిన్న రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనేక మంది ముఖ్యులు జనసేనలో చేరబోతున్నారని తెలిపారు. రాష్ట్ర  మేనిఫెస్టోతోపాటు 175 నియోజకవర్గాలకు మైక్రో మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాకు 25 మందితో.. తర్వాత నియోజకవర్గాలలో 25మందితో కమిటిలు వేసే ప్రక్రియ మొదలైందని పార్థసారథి వివరించారు.

వైసీపీకి షాక్.....జనసేనలోకి సీనియ‌ర్ నేత...

Submitted by arun on Tue, 08/21/2018 - 12:18

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వ‌ల‌స‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఒక పార్టీ నుంచి మ‌రోక పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. రాజ‌కీయ నేత‌లు వ‌రుస‌పెట్టి ఒక పార్టీ నుంచి మ‌రోక పార్టీలోకి జంప్ అవుతున్నారు. గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి, జ‌న‌సేన‌లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌లో వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి క్యూ క‌డుతున్నారు నేత‌లు. దీంతో గోదావ‌రి జిల్లాల‌లో వైసీపీకి షాక్ ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి.

జనసేనలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి

Submitted by arun on Thu, 08/02/2018 - 12:14

టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోతుపల్లి జనసేన పక్షాన చేరారు.  తిరుపతి పర్యటన తరువాత పవన్‌తో టచ్‌లోకి వచ్చిన మోతుపల్లి తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానంటూ హామి ఇచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాన్‌ మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు . కాసేపట్లో మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాన్‌‌ను కలవనున్న మోత్కుపల్లి  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించడంతో జూన్‌లో మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారు.     

జగన్ వ్యాఖ్యలపై తాను చెప్పాల్సిందేదో నేరుగా చెప్పేసిన పవన్

Submitted by arun on Thu, 07/26/2018 - 17:06

రాజకీయ లబ్ది కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన పవన్ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని తన అభిమానులను కోరారు. అంతేకాకుండా జగన్ కుటుంబాన్ని కానీ వారి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. విధివిధానాల పరంగానే తన పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.