Andhrapradesh

దాడి కేసులో సిట్‌ను గడువు కోరిన జగన్

Submitted by chandram on Wed, 11/21/2018 - 20:10

కోడి కత్తి దాడి కేసులో సిట్‌ నోటీసులకు వైసీపీ అధినేత జగన్‌ గడువు కోరారు. విశాఖ ఎయిర్‌పోర్టు జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి వాగ్మూలం ఇవ్వాలంటూ జగన్‌కు సిట్‌ నోటీసులు పంపడంతో ఆయన సమయం కావాలని కోరారు. ఈ మేరకు జగన్ రాసిన లేఖను విశాఖకు చెందిన వైసీపీ నేతలు సిట్‌కు అందచేశారు. కోడి కత్తి దాడి కేసును థర్డ్ పార్టీతో దర్యాప్తు చేయించాలంటూ తాను దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌‌ను ఈ నెల 27న హైకోర్టు విచారించబోతోందని న్యాయస్థానం నిర్ణయం వెలువడిన తర్వాత వాంగ్మూలం ఇస్తానని జగన్‌ తెలిపారు. కోర్టుల పట్ల తనకు అపార గౌరవం ఉందన్న జగన్ వాటి నిర్ణయాన్ని తప్పక పాటిస్తానని సిట్‌కు రాసిన లేఖలో తెలిపారు.

Tags

పవన్‌ కల్యాణ్‌కు లోకేశ్ కౌంటర్...

Submitted by chandram on Wed, 11/21/2018 - 19:21

ఏపీ టీడీపీ మంత్రి నారా లోకేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించాడు. పొయిన ఎన్నికల్లో టీటీడీపి మద్దతు ఇచ్చి మోసాపోయానని పవన్ వ్యాఖ్యలకు లోకేశ్ ఘాటైన సమాధానం ఇచ్చారు. పవన్ టీడీపీకీ మద్దతు ఇచ్చి ఏ విధంగా  మోసపోయాడో వివరించాలన్నాడు. పవన్ ఎప్పుడు అంటే అప్పు సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. అవిశ్వాసం తీర్మాణంపెడితే ఢీల్లీని వణీకిస్తానని చెప్పిన జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ పోయి ఫౌంహౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హొదా ప్రత్యేక హోదా అని అరిచిన పవన్ ఇప్పుడు ఎందుకు నోరుముసుకోని కూర్చున్నడని మండిపడ్డారు.

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

Submitted by arun on Wed, 11/21/2018 - 12:24

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పారిశుద్ధ్య కార్మికుల నుంచి నిరసన సెగ తాకింది. జీవో నెంబర్ 279ను రద్దు చేయాలంటూ హిందూపురంలో బాలయ్య ఇంటిని ముట్టడించి.. ఇంటి ముందు చెత్త వేసి ఆందోళన చేపట్టారు. నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు.

కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత... వైసీపీ నేతల హౌజ్‌ అరెస్ట్‌

Submitted by arun on Wed, 11/21/2018 - 11:21

కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం గొరిగనూరులో ఇవాళ పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న కడప మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జీ సుధీర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌ బాబులను పోలీసులు అడ్డుకున్నారు. గొరిగనూరుకు వెళ్లకుండా ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. శాంతిభద్రతల పేరుతో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గొరిగనూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

జగన్ నోట గరుడ మాట

Submitted by arun on Wed, 11/21/2018 - 10:39

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరో సారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ గరుడ అంటూ ఊరు వాడ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ... దీనిపై రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురపాం బహిరంగ సభలో పాల్గొన్న జగన్‌... చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఐటీ, ఈడీ దాడుల నుంచి జాతీయ కూటమి వరకు అంశాల వారిగా ప్రస్తావిస్తూ చంద్రబాబును నిలదీశారు .

ఆ ఇద్దరికీ నా మనసులో స్థానం ఉంటుంది : వైయస్ జగన్

Submitted by nanireddy on Wed, 11/21/2018 - 08:30

వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సాగిస్తున్నారు. నిన్న కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఆ ఓట్లపై అనుమానం : ఎన్నికల అధికారి సిసోడియా

Submitted by nanireddy on Tue, 11/20/2018 - 21:12

ఏపీలో ఓటర్‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిల్ దాఖలవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా స్పందించారు. 175 నియోజకవర్గాల్లోని ఓటర్‌ జాబితాను పరిశీలించినపుడు 25లక్షల ఓట్లపై అనుమానం వచ్చిందన్నారు. కాగా ఏపీలో  52 లక్షల డూప్లికేట్ ఓట్లు నమోదైనట్లు హైకోర్టులో పిల్‌ దాఖలు అయితే.   తమ లెక్కల ప్రకారం ఆస్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉండవని చెబుతున్నారు సిసోడియా. అనుమానం వచ్చిన ఓట్లపై  బూత్‌ లెవల్ ఆఫీసర్లతో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. దొంగ ఓట్ల ఏరివేత ఇప్పటికే పని ప్రారంభించినట్లు సిసోడియా చెప్పారు.

రేపు చెన్నైలో పర్యటించనున్న పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం

Submitted by arun on Tue, 11/20/2018 - 12:44

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెన్నై  వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. రేపు మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హోటల్‌ కన్నెమోరాలో ప్రెస్‌మీట్‌ పెట్టనున్న పవన్‌  కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. 
 

జగన్‌కు మరోసారి సిట్‌ నోటీసులు

Submitted by arun on Tue, 11/20/2018 - 10:12

కోడి కత్తి దాడి కేసులో జగన్‌‌కు మరోసారి సిట్‌ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో జగన్ వాంగ్మూలం అత్యంత కీలకమైనందున‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని సిట్‌ కోరింది. మరోవైపు ఇదే కేసులో జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన విశాఖ కోర్టు దాడి జరిగిన రోజు ధరించిన చొక్కాను అందజేయాలని ఆదేశించింది. 

ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా.. వైసీపీలో చేరిక

Submitted by nanireddy on Tue, 11/20/2018 - 08:19

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి, టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో నిన్న జగన్ ప్రజాసంకల్పయాత్రలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరారు. అరకు నియోజకవర్గంలోని అరకువేలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, నాయకులు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.