కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 15:28
bhupathi reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఓడిస్తానని చెప్పారు. టీఆర్ ఎస్ పతనం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభం అవుతుందని భూపతిరెడ్డి తేల్చి చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను కూడా ఇప్పుడే రాజీనామా చేస్తానని... లేకపోతే చేయను అన్నారు భూపతిరెడ్డి. నేను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయరు క్షమాపణ ఎందుకు చెప్పరు? అని ప్రశ్నించిన ఆయన పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ముందస్తు ఎన్నికలకు పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భూపతిరెడ్డి. టీఆర్ఎస్ పతనం నిజామాబాద్ నుంచే మొదలవుతోందన్నారు. ఇక కేబినెట్‌లో 70 శాతం మంది కేసీఆర్‌ను తిట్టినవారే ఉన్నారని ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పథకం ప్రకారం టీఆర్ఎస్ పక్కన పెడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ చెప్పిందే వినాలి, లేకపోతే ద్రోహులు అనే ముద్ర వేసే పద్ధతి ఉందని విమర్శించిన భూపతిరెడ్డి నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ మూడు జరగడంలేదన్నారు. 

English Title
trs-mlc-bhupathi-reddy-slams-kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES