మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం..  

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 19:51
you should have good friend

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో కూడా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక వ్యక్తికి మరో వ్యక్తితో ఉండే సాన్నిహిత్యం ప్రస్తుత రోజుల్లో లేదు. కష్టమైనా, సుఖమైనా మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడం లేదు. గత పదేళ్లలో టెక్నాలజీ రంగంలో చోటుచేసుకున్న మార్పు మనిషి జీవనవిధానాన్నే మార్చేసింది. ఈ మార్పు కారణంగా కొన్ని పాత జ్ఞాపకాల్ని, ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అచారాల్నీ, వదులుకోక తప్పలేదు. ఉదాహరణకు దశాబ్ద కాలం కిందట చరవాణి(మొబైల్ ఫోన్) ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో ఇదొక విప్లవమే.. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడటానికి అవసరమైన మాధ్యమమే ఈ ఫోన్.. ఆ తరువాత ఇంటర్నెట్, ఆన్ లైన్ చాటింగ్ లాంటివి వచ్చేశాయి. ఇంకా ముందుకు వస్తే అందులోనే సినిమాలు, చూసుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు..

గతంలో ఇంటిళ్లిపాది అందరూ ఇంట్లో కూర్చును టీవీ చూసే వాళ్ళు.. ఆ సమయంలో వచ్చే ఆనందాన్ని ఇప్పుడున్న ఫోన్లు దూరం చేశాయనే చెప్పాలి. ఫోన్ మాయలో పడి పక్కవాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక ప్రొద్దున లేస్తే ఉరుకులు పరుగులతో జీవితం సాగిపోతోంది. కనీసం భోజనం చెయ్యడానికి కూడా తీరిక లేకుండా.. వెళుతూ వెళుతూ.. ప్రయాణాల్లోనే తినేస్తున్నారు. ఆ సమయంలోనూ పక్క వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అర్థం చేసుకోవడంలో ప్రతి మనిషికి ఒకే విధమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు కానీ ఎదుటివ్యక్తి భావజాలాన్ని అర్ధం చేసుకునే అవకాశం మాత్రం ఉంది. కష్టమైనా సుఖమైనా.. ఆ భావజాలాన్ని ఎదుటివారితో పంచుకుంటే వారి ఆలోచనలు తెలుస్తాయి. సమాజంలో ప్రవర్తించే విధానం మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఎదుటివారితో ఎప్పుడైతే మాట్లాడటం చేస్తారో మనసులో ఉండే ఒంటరి భావాలూ తొలగిపోతాయి. కేవలం ఫోన్ వాడటం, ఒంటరిగా గడపడం కాకుండా మాట్లాడే నేస్తాన్ని ఏర్పరచుకుంటే.. ఈ ప్రపంచంలో మనిషికన్నా మంచి పుస్తకం ఉండదు.

English Title
you should have good friend

MORE FROM AUTHOR

RELATED ARTICLES