స్టాలిన్ కీలక సమావేశం

Submitted by nanireddy on Sun, 09/09/2018 - 07:55
nda-running-electoral-dictatorship

చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో… పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులతో స్టాలిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగ కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ విమర్శించారు. అసలు తమిళనాడు ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల నియంతృత్వాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. మానవ హక్కుల కార్యకర్తలను, బీజేపీని వ్యతిరేకించేవారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందన్నారు. దళితులు, మైనారిటీలపై చాలాచోట్ల దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలవుతోందన్నారు.

English Title
nda-running-electoral-dictatorship

MORE FROM AUTHOR

RELATED ARTICLES