బీజేపీలోకి సూపర్ స్టార్..? మోడీతో భేటీ..

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 16:05
malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బీజేపీకి సినీ గ్లామర్ తక్కువైందనే అభిప్రాయంలో ఉందట. దాంతో సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. భారతీయ గానకోకిల లతా మంగేష్కర్ ను కలిశారు. తాజాగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే అయన బీజేపీలో చేరతారంటూ రూమర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఇటీవల మోహన్ లాల్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకోవడమేనట. పైగా ప్రధాని మోడీతో అయన భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానిని కలిసిన విషయాన్నీ మోహన్ లాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'జన్మాష్టమి రోజు ప్రధానిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. గ్లోబల్‌ మలయాళీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంపూర్ణ సహకారం అందించడానికి ప్రధాని ఒప్పుకొన్నారు. ఇది కేరళలో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా మోహన్ లాల్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున తిరువనంతపురం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

 malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

English Title
malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES