డీఎంకేలో మొదలైన వారసత్వపోరు...స్టాలిన్‌పై బలప్రదర్శనకు దిగిన అళగిరి

Submitted by arun on Wed, 09/05/2018 - 14:15
M K Alagiri Rally

డీఎంకేలో తనకు చోటు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న కరుణానిధి కుమారుడు అళగిరి చెన్నై లో  బలప్రదర్శనకు దిగారు. భారీ అనుచరగణంతో మెరినా బీచ్ చేరుకున్న ఆయన కరుణానిధి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. తనకు పార్టీలో చోటు కల్పించాలంటూ మరోసారి డిమాండ్ చేసిన ఆయన చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టారు. అళగిరి ర్యాలీకి భారీ సంఖ్యలో ఆయన మద్దతు దారులు పాల్గొన్నారు. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది భవిష్యత్తులో తమను ఇబ్బంది పెడుతుందని భావిస్తున్న డీఎంకే .. డేగకన్నుతో పరిశీలిస్తోంది. అళగిరితో సంబంధాలున్నవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇప్పటికే మౌఖిక హెచ్చరికలు పంపారు స్టాలిన్. అళగిరి ఏం ప్రకటిస్తారనే దాని తర్వాత డీఎంకే స్పందించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద చెన్నైలో మరోసారి డీఎంకే కేంద్రంగా రాజకీయ వేడి మాత్రం రగిలినట్లే కనబడుతోంది.

English Title
M K Alagiri Rally

MORE FROM AUTHOR

RELATED ARTICLES