‘యాత్ర’ ఫస్ట్ సాంగ్...

Submitted by arun on Sun, 09/02/2018 - 12:06

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో వైఎస్ఆర్‌లా మ‌మ్ముట్టి ప్ర‌ద‌ర్శిస్తున్న హావ‌భావాల‌ని చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కృష్ణ కుమార్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ ని క‌ళా భైర‌వ పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. 

English Title
ysr biopic movie yatra first single song samara shankham released

MORE FROM AUTHOR

RELATED ARTICLES