పిల్లలను చంపేసి...ప్రియుడితో పారిపోయింది...

Submitted by arun on Sun, 09/02/2018 - 10:17
Mother kills two kids

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. రాత్రి ఇంటికి వచ్చే భర్తను కూడా హత్య చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగరీత్యా భర్త రాత్రి ఇంటికి రాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. పల్లావరం సమీపంలోని కుండ్రత్తూర్‌కి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి విజయ్‌(34), అభిరామి(28) దంపతులకు అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతంలోని ఓ బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు విజయ్‌ దృష్టికి తీసుకురాగా... భార్యను నిలదీశాడు.  పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.

దీంతో సదరు మహిళ ప్రియుడితో కలసి ఉండేందుకు భర్త, ఇద్దరు పిల్లలను చంపేయాలని నిర్ణయించుకుంది. అయితే బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో తాను ఆలస్యంగా వస్తానని శుక్రవారం విజయ్ భార్యకు చెప్పాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఆ రోజు రాత్రి పాలలో విషం కలిపి ఇచ్చింది. అనంతరం ప్రియుడితో కలసి కోయంబేడు బస్టాండ్ కు వెళ్లి నాగర్ కోయిల్ బస్సు ఎక్కేసింది. రాత్రి ఇంటికివచ్చిన విజయ్ తలుపులు మూసిఉండటం, లైట్లు వెలుగుతూ ఉండటంతో రెండో తాళంతో ఇంటి లోపలకు వెళ్లాడు. అక్కడ నేలపై ఇద్దరు పిల్లలు నురగలు కక్కుతూ అచేతనంగా పడిఉండటంతో వెంటనే అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఈ పిల్లలను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సుందరాన్ని అరెస్ట్ చేసిన అధికారులు అభిరామి కోసం గాలిస్తున్నారు. తొలుత పిల్లలతో పాటు భర్త విజయ్ ను కూడా చంపేయాలని అభిరామి నిర్ణయించుకుందనీ, కానీ కుదరకపోవడంతో పిల్లలకు విషమిచ్చిందని సుందర్ విచారణలో తెలిపాడు.

English Title
Chennai: Mother kills two kids, elopes with lover

MORE FROM AUTHOR

RELATED ARTICLES