పార్టీ ఫిరాయించిన తల్లి.. కసితో ఆమె కుమారుడిని కాల్చిన బీజేపీ నేత!

Submitted by arun on Sat, 09/01/2018 - 11:51
Bengal

 పశ్చిమ బెంగాల్ లో  దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయించి తమను ఇబ్బంది పెట్టిన మహిళపై కోపంతో బీజేపీ నేత ఒకరు ఆమె మూడేళ్ల కుమారుడి తలపై తుపాకీతో కాల్చాడు. పశ్చిమబెంగాల్‌లోని పంచాయితీ బోర్డు ఎన్నికల సందర్భంగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మానిక్‌చాక్‌ డివిజన్‌ పరిధిలోని 18 పంచాయితీల్లో పదింటిని బీజేపీ గెలుచుకుంది. తృణమూల్‌ 6 గెలుచుకోగా, చెరొకటి గెలుచుకున్న సీపీఎం, కాంగ్రె్‌సలు తృణమూల్‌కే మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో బీజేపీ తరపున గెలిచిన పుతుల్‌ మండల్‌ అనే మహిళ సొంతపార్టీకి షాకిస్తూ.. తృణమూల్‌కి మద్దతు ప్రకటించారు. దీంతో డివిజన్ లో ఇరువురి బలాబలాలు 9 సీట్లతో సమానమయ్యాయి. చివరికి టాస్ వేయగా, బీజేపీని విజయం వరించింది. అయితే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన మండల్ తృణమూల్ వైపు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేత అనిల్ రగిలిపోయాడు. తుపాకీ తీసుకుని హతమార్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ మండల్ కనిపించకపోవడంతో ఆమె కుమారుడి(3) తలపై తుపాకీతో కాల్చాడు. అయితే ఈ దాడిని తాము చేయలేదనీ, తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

English Title
3-yr-old shot in head during TMC-BJP clash in Bengal over local body elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES