ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 13:40
priya prakash varrier

ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ తో ప్రియకు ఎంత స్టార్ డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో  ప్రియా వారియర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక.. కేసు వేసిన వారిని ఉద్దేశిస్తూ ‘మీకేం పని లేదా.. ప్రతి దానికి ఇలా కేసులు వేసుకుంటూ కూర్చుంటారా’ అంటూ చివాట్లు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా ఇన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమర్‌ లులు దర్శకత్వంలో వచ్చిన ‘ఒరు అదార్ లవ్’  చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రియా ప్రకాశ్‌ మీద కేసు వేశారు.

English Title
"You Have No Other Job?": Chief Justice Slams Case Against Priya Varrier

MORE FROM AUTHOR

RELATED ARTICLES