ఫ్లిప్‌కార్ట్‌ 'సూపర్ సేల్‌' ఊహించని తగ్గింపు

Submitted by nanireddy on Thu, 08/23/2018 - 19:05
flipkart-superr-sale-discounts-best-selling-smartphones-tvs

ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఫ్రీడం సేల్‌ ముగిసింది. ఈ సేల్ ముగిసిన రెండు వారాల్లోనే మరో ఆఫర్ ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ‘సూపర్ర్‌ సేల్‌’ పేరుతో  దీన్ని ప్రకటించింది. ఈ సేల్‌లో పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.  ఆగస్టు 25 నుంచి ఈ సేల్‌ లైవ్‌లోకి  వస్తుంది.  ఆసుస్‌, డెల్‌, ఏసర్‌ వంటి ల్యాప్‌టాప్‌ బ్రాండ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ సేల్ లో ల్యాప్‌టాప్‌లపై కొనుగోలుదారుడు అదనంగా 2వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్‌, ఎల్‌జీ, వర్‌పూల్‌ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లపై 30 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. 

ముఖ్యమైన ఆఫర్లు.. 

* రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 25వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌కు వస్తుంది.
* శాంసంగ్‌, ఎల్‌జీ, వర్‌పూల్‌ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లపై 30 శాతం తగ్గింపు.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ (ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది).
* ల్యాప్‌టాప్‌లపై అదనంగా రూ.2వేలు తగ్గింపు.
* గానా ప్లస్‌కు 6 నెలల సబ్‌స్క్రిప్షన్‌, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి రూ.550 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌.
* బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి రూ.100 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

English Title
flipkart-superr-sale-discounts-best-selling-smartphones-tvs

MORE FROM AUTHOR

RELATED ARTICLES