12 ఏళ్ల చెవిటి బాలికపై 17 మంది అత్యాచారం

Submitted by arun on Wed, 07/18/2018 - 10:31
Chennai, molestation on girl

తమిళనాడులోని ఐనవరంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల వినికిడి లోపం ఉన్న బాలికపై 6 నెలలుగా 17 మంది అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికకు మత్తు మందు ఇచ్చి లిఫ్టులు, బాత్‌రూమ్‌లలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది.

దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై మానవ మృగాలు పైశాచికానికి పాల్పడ్డాయి.  12 ఏళ్ల బాలికపై  17 మంది కామాంధులు అత్యాచారం జరిపారు. మత్తుమందు ఇచ్చి ఆ బాలికపై అత్యాచారం చేశారు. అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్‌, లిప్ట్‌ ఆపరేటర్లు, పనిమనుషులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై కన్నేసిన లిప్ట్‌ ఆపరేటర్‌ బాలిక పాఠశాల నుంచి తిరిగి వచ్చే క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అతని స్నేహితులను పిలిచి సామూహికంగా అత్యాచారం చేయడం మొదలు పెట్టారు.  తర్వాత వారి స్నేహితులను పిలిచి ఇలా 17 మంది ఆ బాలికను దారుణంగా అత్యాచారాం చేయడం ప్రారంభించారు.  ఆ సమయంలో బాలికకు మత్తుమందు ఇస్తూ అరవకుండా చేస్తూ వచ్చారు. బాలిక నగ్న ఫోటోలు చూపించి ఇంట్లో చెబితే అందరికీ చూపిస్తామని బెదిరించారు. 

బాలిక అక్క సెలవులకు ఈ నెల 13న చెన్నై రావడంతో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బాలికను గమనించి అక్క విషయాన్ని పసిగట్టింది. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంది.  వెంటనే ఆ దారుణాన్ని తన తల్లిదండ్రుల తెలియజేసింది. తమ కూతురుకి జరిగిన దారుణాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. లిప్ట్‌ ఆపరేటర్‌ రవి తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ మెదలెట్టిన పోలీసులు బాలిక చూపించిన 17మందిని అరెస్ట్‌ చేసి సైదాపేట న్యాయస్థానం హాజరు పరిచారు.

దివ్యాంగురాలైన ఆ బాలిక పట్ల అంత దారుణానికి వడికట్టిన  17మంది కామాంధులను సైదాపేట కోర్టు న్యాయవాదులు పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టారు. కోర్టు లోపలికి వచ్చిన నిందితులు తమ తరఫున వాదించాలని లాయర్లను కోరేందుకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన న్యాయవాదులు మూకుమ్మడిగా నిందితులపై దాడికి దిగారు. పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు వచ్చారు. పోలీసులు ఆ దుర్మార్గులను రక్షించి జైలుకు తరలించారు.    

English Title
17 men arrested for raping 12-year-old girl in Chennai

MORE FROM AUTHOR

RELATED ARTICLES