11 ఏండ్ల బాలికపై 22 మంది అత్యాచారం

Submitted by arun on Tue, 07/17/2018 - 15:55
Chennai

అభం శుభం తెలియని చిన్నారిపై కొంతమంది మానవ మృగాళ్లు విరుచుకుపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 22 మంది.. 11 ఏండ్ల బాలికపై వరుసగా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. వినికిడి సంబంధ సమస్య ఉన్న బాలికపై నెలల తరబడి అత్యాచారం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు 18 మందిని సోమవారం అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ ఇచ్చిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే దాన్ని బయట పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాలిక వారు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. ఆ చిన్నారి అసహాయతను తమకు అనుకూలంగా మలుచుకున్న దుర్మార్గులు నెలల తరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  గత శనివారం ఢిల్లీలో చదువుకుంటున్న తన సోదరి ఇటీవలే చెన్నై రావడంతో బాధితురాలు ఆమెతో తన గోడు వెళ్ళబోసుకుంది. వెంటనే స్పందించిన ఆమె, తల్లిదండ్రుల సాయంతో అయనవరం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రవి కుమార్ అనే 66 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్ మొదట తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు చెప్పింది. మూడ్రోజుల తర్వాత అతడు మద్యం సేవించిన మరో ఇద్దర్ని తీసుకొచ్చాడు. వారిద్దరూ రేప్ చేయడంతోపాటు వీడియో తీశారు. కొద్ది రోజుల తర్వాత మరికొందరు ఆ బాలికపై అత్యాచారం చేశారని పోలీసులకు చెప్పింది.

English Title
11-Year-Old Girl Allegedly Raped For Months In Chennai, 17 Arrested

MORE FROM AUTHOR

RELATED ARTICLES