నాగ్ థాంక్యూ: సోనాలి బింద్రే

Submitted by arun on Fri, 07/06/2018 - 14:47
sonalinag

హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానంటూ అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కు గురిచేశారు బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే. దాంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఎంతో మంది సోషల్‌మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు పెట్టారు. ఈ సందర్భంగా తనకు ట్వీట్లు చేసినవారందరికీ పేరుపేరునా సోనాలి ధన్యవాదాలు తెలిపారు.

‘క్యాన్సర్‌ను జయించాలన్న నీ గొప్ప సంకల్పానికి బలం చేకూరి నువ్వు త్వరగా కోలుకోవాలి డియర్’ అంటూ అక్కినేని నాగార్జున పెట్టిన ట్వీట్‌కు ‘నాగ్ థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చింది సోనాలి.
‘జెనీలియా నీలో ఎంతో పాజిటివిటీ ఉంది. థాంక్యూ మై డియర్‌’
‘థాంక్యూ రితేష్‌జీ..మీకు, జెనీలియాకు ఎంతో ధైర్యం ఉంది. మీ నుంచి నేనూ కొంత తీసుకోవాలని అనుకుంటున్నాను’
‘థాంక్యూ మనీశా. నువ్వే నా స్ఫూర్తి’
‘నువ్వు వండిపెట్టే రుచికరమైన వంటను నేను మిస్సవుతున్నాను ఫరా ఖాన్‌. ఆ వంటను మరోసారి రుచిచూడటానికైనా నేను త్వరగా ముంబయి వచ్చేస్తాను’.
‘ధన్యవాదాలు అనిల్‌ కపూర్‌జీ. మనముంటున్న కాలనీని మిస్సవుతున్నాను. మిమ్మల్ని త్వరలోనే చూస్తానని ఆశిస్తున్నాను’

English Title
Sonali Bendre expresses gratitude for all the good wishes, says she is ‘fighting at being fit again’

MORE FROM AUTHOR

RELATED ARTICLES