ఐపీఎస్ ఆఫీసర్ వెంట పడుతున్న ఓ యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 10:29
Sachin Atulkar

కేవలం సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్ల వెంటే అభిమానులు పడుతుంటారని భావిస్తుంటారా? అయితే, మీ ఆలోచన తప్పు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మూడు రోజుల క్రితం వచ్చిన పంజాబ్, హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి, తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంది. ఈ యువతి సైకాలజీలో పీజీ చేసింది. ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34)ను కలవాలని ఆ యువతి.. ఆయన కార్యాలయం ముందు పడిగాపులు కాస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జి రేఖా వర్మ.. యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడింది.

సోషల్ మీడియాలో ఐపీఎస్ సచిన్ ఫోటోలు చూసిన తర్వాత ఆయనపై అభిమానం పెరిగిందని.. మనసు పారేసుకున్నానని యువతి పోలీసులకు చెప్పింది. సచిన్‌ను తక్షణమే కలవాలని పోలీసులకు స్పష్టం చేసింది. యువతి డిమాండ్‌కు ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఆ యువతి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇక చేసేదిమి లేక పంజాబ్‌కు పంపించేందుకు నగ్డా రైల్వేస్టేషన్‌కు ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు ఆమెను. ఆ యువతి అడిగిన ఆహారాన్ని తీసుకువస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై సచిన్ అతుల్కర్‌ను మీడియా సంప్రదించగా.. ప్రభుత్వ అధికారిగా ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధం. వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని స్పష్టం చేశారు. బ్రహ్మచారిగా ఉన్న ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రతీ రోజు 70 నిమిషాల పాటు జిమ్ చేస్తాడు. ఫిట్‌నెస్ కాంపిటీషన్‌లో సచిన్ అతుల్కర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

English Title
Punjab Woman Comes To Madhya Pradesh To Meet Her Hero IPS Officer

MORE FROM AUTHOR

RELATED ARTICLES