ప్ర‌భాస్ - చిరంజీవి సేమ్ టూ సేమ్

Submitted by lakshman on Sat, 03/31/2018 - 04:36
Is Chiranjeevi's Sye Raa Narasimha Reddy look inspired by Prabhas' character Amarendra Baahubali

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.  సురేంద‌ర్ రెడ్డి డైర‌క్ష‌న్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతుంది. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన  వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. బ్రిటీష్ వారి  దొరతనము ఎదిరించి వీరమరణం పొందారు.  ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా రూపొందుతుంది. 
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్రని చిరంజీవి చేయ‌డంతో అంచానాలు పెరిగిపోయాయి. దీనికి తోడు అన్నీ ఇండ‌స్ట్రీల‌కు చెందిన తారాగ‌ణం  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ మరియు జగపతి బాబు వంటి ప్రముఖ నటులంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఏ విష‌య‌మైన నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.  
ప్ర‌స్తుతానికి సైరాలుక్ లో ఉన్న చిరంజీవి ఇమేజ్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ఈ ఇమేజ్ పై ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఆట‌క‌ట్టించే పాత్రలో రాజ‌సం ఉట్టే ప‌డేలా  చిరంజీవి ధ‌రించిన‌ క్యాస్టూమ్స్ , బాహుబ‌లి సినిమాలో అమ‌రేంద్ర‌బాహుబ‌లిగా ప్ర‌భాస్ ధ‌రించిన  క్యాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నాయంటూ ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్ కు, అమరేంద్ర బాహుబలి లుక్ తో దగ్గర పోలికలు ఉన్నాయని అభిమానులు గుస‌గుస‌లాడుతున్నారు.  

English Title
Is Chiranjeevi's Sye Raa Narasimha Reddy look inspired by Prabhas' character Amarendra Baahubali

MORE FROM AUTHOR

RELATED ARTICLES