రజనీకాంత్ రాజకీయాల్లో.. కుటుంబసభ్యులు!!

Submitted by arun on Fri, 03/16/2018 - 15:29
rajini

రాజకీయ పార్టీ పెడతా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తా అని ప్రకటించి సంచలనానికి తెర తీసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసేస్తున్నారు. మానసిక స్థైర్యం అందుకునేందుకు ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న రజనీ.. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నారు.

ఇంతలోనే.. రజనీ పెట్టబోయే పార్టీలో చేరేందుకు చాలా మంది ప్రముఖులు సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. అందులో.. ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యతో పాటు.. ఐశ్వర్య భర్త, హీరో ధనుష్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు.. ఏ కార్యక్రమంతో అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

దీంతో.. రజనీ పార్టీలో కూడా కుటుంబానిదే పెత్తనం కాబోతోందా.. అన్న చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంలో రజనీ కాస్త జాగ్రత్తగా ఉండాలని... పార్టీపై పూర్తి హక్కులను తన చేతుల్లోనే ఉండేలా చూసుకోవాలని.. మరో వ్యక్తికి.. ముఖ్యంగా కుటుంబసభ్యులకు కీలక పాత్ర ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సలహాలు అందుతున్నాయి.

ఈ విషయంలో రజనీకాంత్.. ఎలా స్పందిస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!

English Title
rajinikanth family to come politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES