అసెంబ్లీలో దెయ్యాలు ఉన్నాయ్‌..!

Submitted by arun on Fri, 02/23/2018 - 14:37
assembly

రాజస్థాన్‌ అసెంబ్లీకి ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎవరూ సరిగా హాజరు కావడం లేదు. ఒకే సారి 2 వందల మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యే సరికి విషయం ఆరా తీశారు. వాస్తవం తెలుసుకున్న జనం అవాక్కయ్యారు. ఇంతకీ రాజస్థాన్‌ అసెంబ్లీలో భారీ సంఖ్యలో గైర్హాజరవ్వడానికి కారణం ఏంటి..? ఆ అవాక్కయ్యే ఘటనేమిటి..? 

సాధారణంగా దెయ్యాలు ఏదో పాడుబడిన ఇంట్లోనో...శ్మశాన వాటికల్లోనో తిరుతాయని అంటుంటారు. కానీ ఈ భూతాలు హై లైవెల్. ఏకంగా రాజస్థాన్‌ అసెంబ్లీలోనే ఎంట్రీ ఇచ్చాయి. నిజం ఇటీవల కొన్ని దెయ్యాలు రాజస్థాన్‌ శాసన సభలోనే తిష్ట వేశాయట. ఆ కారణంగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు 200 మంది చాలాకాలంగా అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అంతేకాదు అసెంబ్లీలో ఆత్మలు తిరుగుతున్నాయంటూ ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేశారు. శాంతి పూజలు చేస్తేనే శాసన సభకు వస్తామని తెగేసి చెస్పారు. దీంతో రాజస్థాన్ అసెంబ్లీలో పూజారుల్ని పిలిచి పూజాది కార్యక్రమాలు చేయించారు.

అసలు సంగతేమిటంటే..రాజస్థాన్ అసెంబ్లీకి 2 వందల మీటర్ల దూరంలో ఓ శ్మశాస వాటిక ఉంది. ఇప్పటికీ అక్కడ మృతదేహాల అంతిమ సంస్కారం జరుగుతోంది. దీంతో శ్మశానం పక్కనున్న అసెంబ్లీకి వెళ్ళాలంటే శాసన సభ్యులు భయపడుతున్నారు. పైగా ప్రస్తుత అసెంబ్లీ భవనం కట్టిన స్థలంలో గతంలో అంత్యక్రియలు చేసే వారట. ఈ కారణంగానే అసెంబ్లీలో ఆత్మలున్నాయని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అసెంబ్లీలో భూతాలు తిరుగుతున్నాయనేది ఒట్టి పుకారేననని కొందరు నేతలు. స్మార్ట్‌ఫోన్‌ల కాలంలోనూ దయ్యాలు, భూతాలు భయమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదని తెగేసి చెబుతున్నారు. దెయ్యం భయానికి లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేశారు సరే. మరి ఆత్మల భయానికి రాజస్థాన్ అసెంబ్లీని కూడా మార్చేస్తారేమోననని జనం సెట్లైర్లు వేసుకుంటున్నారు.   

English Title
MLAs fear spirits haunting Rajasthan Assembly, demand 'yagya'

MORE FROM AUTHOR

RELATED ARTICLES