రాజస్తాన్ మంత్రి ఏం చేశాడో చూడండి

Submitted by arun on Thu, 02/15/2018 - 15:25
minister

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరో మచ్చ. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీచరణ్ సరఫ్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద బహిరంగంగా మంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనను మంత్రి కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయంకాదన్నారాయన. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. ఇదేమీ పెద్ద విషయం కాదని, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఒకవైపు స్వచ్ఛభారత్ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే, ఇలాంటి మంత్రలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తన స్వంత నియోజకవర్గంలోనే ఇలా చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలన్నారు. దోల్‌పూర్ ఉప ఎన్నికల సమయంలోనూ మంత్రి సరఫ్ ఇలాగే బహిరంగంగా మూత్ర విసర్జన చేశారన్నారు.

English Title
rajastan minister urinating on jaipur walls goes viral

MORE FROM AUTHOR

RELATED ARTICLES