బీజేపీకి బిగ్‌ షాక్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 12:08
By Election Results

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ రాష్ట్రంలోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఝలక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక రాజస్థాన్‌లోని ఆల్వార్‌, అజ్మీర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.

రాజస్థాన్ లోని ఆళ్వార్, అజ్మీర్ ఈ రెండు లోక్ సభ స్థానాలను గతంలో బీజేపీయే కైవసం చేసుకోగా, తాజాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. అళ్వార్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ 10,000 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. అజ్మీర్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘు శర్మ 8,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

బెంగాల్‌లోని ఉలుబేరియా లోక్‌సభ ఫలితాల్లో కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. రాజస్థాన్‌లోని మందల్‌ఘడ్‌ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 'పద్మావత్'  చిత్ర విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్ పుత్ లకు అనుకూలంగా వ్యవహరించలేదన్న ఆగ్రహం రాజస్థాన్‌ లో ఆ వర్గం ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పిందని అంచనా వేస్తున్నారు.

కాగా, రాజస్థాన్‌లో రెండు పార్లమెంట్‌ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, పశ్చిమ బెంగాల్‌లోని ఒక పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను.. సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించిన విషయం తెలిసిందే.

English Title
congress lead rajasthan poll results

MORE FROM AUTHOR

RELATED ARTICLES