తమిళనాడులో బీజేపీ రికార్డు: సుబ్రహ్మణ్య స్వామి

Submitted by arun on Sun, 12/24/2017 - 13:57
BJP

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడాన్ని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. తమిళనాడులో బీజేపీ రికార్డు సాధించిందని ఎద్దేవా చేస్తూ, ఓ జాతీయ పార్టీగా ఉండి, కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ అభ్యర్థికి, నోటాకు పడ్డ ఓట్లలో పావు వంతు కూడా రాలేదని చెప్పారు. ఉప ఎన్నికలో దినకరన్‌ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 

English Title
TN BJP record

MORE FROM AUTHOR

RELATED ARTICLES