మసాలా స్పైసీ రైస్ తయారీ ఎలా..?

మసాలా స్పైసీ రైస్ తయారీ ఎలా..?
x
Highlights

కావలసిన పదార్ధాలు : బాస్మతి బియ్యం -పావు కిలో బంగాళాదుంపలు -4 వంకాయలు -3 ఉల్లిపాయలు -3 నూనె -ముప్పావు కప్పు పచ్చి బఠానీలు -అర కప్పు కారం...

కావలసిన పదార్ధాలు :

బాస్మతి బియ్యం -పావు కిలో

బంగాళాదుంపలు -4

వంకాయలు -3

ఉల్లిపాయలు -3

నూనె -ముప్పావు కప్పు

పచ్చి బఠానీలు -అర కప్పు

కారం -ముప్పావు చెంచా

గరం మసాలా -అర చెంచా

ఉప్పు -సరిపడా

కొత్తిమీర -కొంచెం

జీలకర్ర -ఒక చెంచా

కొబ్బరి తురుము

తయారీ విధానం :

ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బంగాళా దుంపలను చెక్కుతీసి ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి. వంకాయలను కూడా ఒకటిన్నర అంగుళం పొడవు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీలో జీలకర్ర, ధనియాలపొడి, కారం, ఉప్పు, గరంమసాలా, కొబ్బరి తురుమువేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనెపోయాలి. నూనె కాగిన తర్వాత తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ ను వేయాలి. తరువాత బంగాళాదుంప, వంకాయ, ఉల్లి ముక్కలు, పచ్చి బఠానీ, వేసి ఒక నిమిషం వేపాలి. కాసేపు సన్నని మంటమీద కూరగాయ ముక్కలను ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దింపాలి. అన్నం విడిగా ఉడికించి పెద్ద గిన్నెలో పోసి, అందులో కూరను వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత మసాలా స్పైసీ రైస్ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories