కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ!

Submitted by arun on Sat, 03/24/2018 - 17:05
uv

ఐపీఎల్‌ కోసం భారత స్టార్‌ ఆటగాళ్లు సరికొత్తగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్‌ ఆటగాడు వచ్చి చేరాడు. అతడే సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన యువీ.. ఈ క్రమంలోనే మరో క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు సారీ చెప్పాడు. అదేంటి కేఎల్‌ రాహుల్‌కి యువీ సారీ చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా?, ఇందుకు అతని హెయిర్‌ స్టైల్‌ను అనుకరించడమే.

' నా లాంగ్‌ హెయిర్‌ స్టైల్‌కు ముగింపు పలుకుతున్నా. ఇది న్యూలుక్‌లో కనిపించే సమయం. రాహుల్‌ షార్ట్‌ హెయిరే నన్ను బలవంతంగా ఇలా చేయించుకునేలా చేసింది. సారీ రాహుల్‌' అని యువరాజ్‌ పేర్కొన్నాడు.

English Title
Yuvraj Singh Gets A Haircut, Apologises To KL Rahul

MORE FROM AUTHOR

RELATED ARTICLES