నిరుద్యోగ యువతను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ యత్నం

x
Highlights

ఏపీలో యువతను టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువత సపోర్ట్ కావాలని భావిస్తున్న వైసీపీ వారిని...

ఏపీలో యువతను టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువత సపోర్ట్ కావాలని భావిస్తున్న వైసీపీ వారిని ఆకర్షించే పనిలో పడింది ఇందులో భాగంగా విద్యార్ధులు, నిరుద్యోగులు యువతకు సంబంధించిన సమస్యలపై పోరాటాలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది..

యువతను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ అధికార పార్టీ నిరుద్యోగ బృతి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రతంగా ప్రచారం చేస్తోంది అటు జనసేన పవన్ కల్యాణ్ కూడా యువతను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ సైతం నిరుద్యోగ యువతను తమవైపు తిప్పుకునేందుకు కార్యాచరణ రూపొందిచింది..

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాట కార్యక్రమాలకు వైసీపీ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది.. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి నవంబర్ 17వ తేదీ వరకూ విడతల వారీగా విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాట కార్యక్రమాలు డిజైన్ చేశారు. అక్టోబర్ రెండు, మూడు తేదీల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేష‌న్ విష‌యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 48 గంటల దీక్షలకు దిగనున్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 20వేల ఉద్యోగాలు భర్తీకి జీవో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దీక్షకు దిగుతోంది వైసీపీ

ఇక చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని అక్టోబర్ 25నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రభుత్వ హాస్టల్‌లోని విద్యార్థుల సమస్యపై హాస్టల్ నిద్ర కార్యక్రమాని చేపట్టనున్నారు న‌వంబ‌ర్ 5 నుంచి 15 తేది వ‌ర‌కూ విద్యార్ధి, యువ‌జ‌న విభాగాల మెంబ‌ర్ షిప్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇక న‌వంబ‌ర్ 17 తేదిన ఇంటర్ నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా అమ్మవడి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను వివరిస్తూ జగన్ కళాశాలల్లో సమావేశాలు నిర్వహించనున్నారు..

వీటితో పాటు యువ‌జ‌న విభాగానికి ప‌లు కార్యక్రమాలను రూపొందించారు సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీల అమలు నెరవేర్చలేదంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు మొత్తానికి యువ‌తను టార్గెట్‌ చేసుకొని వైసీపీ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది మరి ఆయా కార్యక్రమాలను వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు ఎంత మేరకు విజయవంతం చేస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories