వివాహితతో ప్రేమ వ్యవహారం: ముగ్గురు బలి

Submitted by arun on Fri, 08/03/2018 - 16:52

పశ్చని సంసారంలో ఫేస్‌బుక్‌ చిచ్చుపెట్టింది. ఫేస్‌బుక్‌ ప్రేమ ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా ఈ వ్యవహారానికి బాధ్యుడిగా భావిస్తున్న యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే, బిందు భర్త సాయికి ఫోన్‌ చేసిన మురళి బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని బెదిరించాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

భార్యాభర్తల మరణాలపై పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యాభర్తల ఆత్మహత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందని మురళి భయపడ్డాడు. పోలీసుల విచారణకు భయపడిన మురళి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జంగారెడ్డి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురి చావులకు కారణమైంది. 

English Title
youth committed suicide extramarital love affair west godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES